Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తాయి. కొన్ని జిల్లాల్లో భానుడి భగభగలు కొనసాగుతూ 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ఈ వింత వాతావరణం కారణంగా గాలిలో హుమిడిటీ (తేమ) శాతంతో పాటు ఉక్కపోత విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
rain alert ap telangana
Read also:Indiramma Housing Scheme : ఇందిరమ్మ స్కిం ఫేజ్-2 గైడ్లైన్స్ !
ఏపీలో ఎండల తీవ్రత.. వడగాల్పుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రతతో పాటు పిడుగుల ముప్పు మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అయితే, ఆదివారం నుంచి ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శనివారం నాడు రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
Weather Update: జిల్లాల వారీగా గరిష్ట ఉష్ణోగ్రతల అంచనా:
శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో 40 – 42 డిగ్రీలు, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాలలో 43 – 44 డిగ్రీలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలలో 43 – 44 డిగ్రీలు.
ఉపరితల ఆవర్తనం.. ఐదు జిల్లాల్లో వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాయలసీమతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది.
విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు:
- ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగుల కింద నిలబడకూడదు.
- పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ఆకాశం మేఘావృతమైన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
- ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
- బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా నీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి.
- వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు, గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తపడాలి.
తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలో సైతం ఎండ తీవ్రతతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

