Dailyhunt
హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్: ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లో ఐపీఎల్ ఫీవర్: ఉప్పల్ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు..

వార్త 2 weeks ago

IPL 2026 Hyderabad Schedule: హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్న టాటా ఐపీఎల్ 2026 (Tata IPL 2026) మ్యాచ్‌ల కోసం రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు.

ఏప్రిల్ 5 నుండి మే 22 వరకు జరిగే ఏడు మ్యాచ్‌ల సందర్భంగా క్రికెట్ అభిమానులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Also:CSK vs PBKS IPL 2026 Highlights: చెపాక్‌లో పంజాబ్ పంజా: చెన్నైకి వరుసగా రెండో ఓటమి!

 parking rules for Uppal Stadium IPL

IPL 2026 Hyderabad Schedule: ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

మ్యాచ్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 12:00 నుండి రాత్రి 11:50 వరకు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వరంగల్ వైపు నుండి వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా మళ్లిస్తారు.ఘట్‌కేసర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను బోడుప్పల్ మీదుగా, ఎల్బీ నగర్ నుండి వచ్చే వాహనాలను నాగోల్ మీదుగా దారి మళ్లిస్తారు.సాధారణ ప్రయాణికులు ఉప్పల్ ప్రధాన రహదారికి బదులుగా నాగోల్, తార్నాక లేదా చెర్లపల్లి మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

కట్టుదిట్టమైన భద్రతా వలయం

సుమారు 39,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్న తరుణంలో పోలీసులు భారీ నిఘా ఏర్పాటు చేశారు.లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, షీ టీమ్స్ మరియు బాంబ్ స్క్వాడ్‌లతో కలిపి మొత్తం 2,000 మంది సిబ్బందిని మోహరిస్తున్నారు.స్టేడియం లోపల మరియు బయట కలిపి 430 సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను పర్యవేక్షిస్తారు.స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పెద్ద బ్యాగులు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహారం, సిగరెట్లు, లైటర్లు, పదునైన వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు.మ్యాచ్ వీక్షించడానికి వచ్చేవారు వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజారవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also:

    పంత్‌కు మైఖేల్ వాన్ వార్నింగ్: 'వైభవ్ సూర్యవంశీలా ఆడు..

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha