Rishabh Pant: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రూ. 27 కోట్ల భారీ ధర పలికిన పంత్, తన ఆటతీరును మార్చుకోవాలని, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని చూసి నేర్చుకోవాలని సూచించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన పంత్, కేవలం 7 పరుగులకే వెనుదిరగడం అభిమానులను నిరాశపరిచింది.
Read Also:CSK vs PBKS IPL 2026: చెపాక్‌లో చెన్నై బ్యాటింగ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
Rishabh Pant: వైభవ్ సూర్యవంశీని ఆదర్శంగా తీసుకో!
జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే అతడు వైభవ్ సూర్యవంశీ తరహాలో దూకుడైన ఆటతీరును కలిగి ఉండాలని అన్నాడు మైఖేల్ వాన్. పంత్ ఎంతో ప్రతిభావంతులైన ప్లేయర్లు ఉన్న దేశం తరుపున ఆడుతున్నాడు. అతడి నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుంటే వేరే దేశాల జాతీయ జట్టులోనూ ఈజీగా చోటు సంపాదించుకోగలడు. అతడు బంతిని బలంగా కొడతాడు. మంచి కీపర్, ఆలోచన సామర్థ్యం అద్భుతం. అని మైఖేల్ వాన్ అన్నాడు.అయితే.. భారత దేశానికి ఆడే విషయానికి వస్తే మాత్రం ఇషాన్ కిషన్,
Michael Vaughan on Rishabh Pant IPL 2026
సంజూ శాంసన్, జితేశ్ శర్మ వంటి వికెట్ కీపర్ల నుంచి రిషబ్ పంత్‌కు తీవ్రమైన పోటీ ఉందన్నాడు. జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలంటే అతడు ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలని సూచించాడు.వైభవ్ సూర్యవంశీలా ఆడాలని, ముఖ్యంగా అతడు ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలన్నాడు. ఇక బంతిని మైదానం ఆవలకు పంపించేందుకు ప్రయత్నించాలి. తాను 48 బంతుల్లో 100 పరుగులు చేయగలను అనే ఆలోచనా విధానాన్ని పంత్ కలిగి ఉండాలన్నాడు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
చెపాక్‌లో చెన్నై 'సూపర్' బ్యాటింగ్: పంజాబ్ ముందు 210 పరుగుల లక్ష్యం

