Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో అకస్మిక వర్షం.. వేసవి తాపం నుంచి నగరవాసులకు ఊరట!

హైదరాబాద్‌లో అకస్మిక వర్షం.. వేసవి తాపం నుంచి నగరవాసులకు ఊరట!

వార్త 2 months ago

Hyderabad Weather: నగరవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన ప్రాంతాలైన అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసరాల్లో వర్షం పడింది.

Read Also:Telangana Weather Updates: రేపటి నుంచి రాష్ట్రంలో వాతావరణం కూల్.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు!

 Relief for Hyderabad residents from summer heat

Hyderabad Weather: ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం

నగరంలోని శివారు ప్రాంతాలైన ఎల్బీ నగర్, హయాత్‌నగర్, వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి మేఘాలు కమ్ముకోవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

ఈ అకస్మిక వర్షం వల్ల రహదారులపై నీరు చేరి వాహనదారులు కొంత ఇబ్బంది పడినప్పటికీ, వేడి నుంచి విముక్తి లభించడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. రాగల కొన్ని గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. వచ్చే 2 నెలలు ఎండలు తీవ్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha