Dailyhunt
నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. వచ్చే 2 నెలలు ఎండలు తీవ్రం

నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. వచ్చే 2 నెలలు ఎండలు తీవ్రం

వార్త 2 weeks ago

తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Telangana Heat Wave: దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 - 45 డిగ్రీలు నమోదవుతున్నాయి.

రాబోయే రోజుల్లో 45 డిగ్రీలు దాటుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ఉదయం 10 గంటలకూ బయటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఈ క్రమంలోనే రాబోయే రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాతోపాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్, మల్కాజ్గరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Read Also: Amit Shah on Delimitation: డీలిమిటేషన్ అప్‌డేట్.. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు ఇవే!

 Telugu states like a furnace of fire.. The sun will be intense for the next 2 months

Telangana Heat Wave: మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దు

ఈ ఏడాది వేసవి సుదీర్ఘంగా ఉంటుందని చెబుతున్నారు. వర్షాలు కురిస్తే తప్ప హీట్‌ నుంచి ఉపశమనం లభించదని పేర్కొంటున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో 215 మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉస్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. గురువారం హైదరాబాద్ నగరం అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. నగరంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 42°C మార్కును దాటాయి. ఆర్సీ పురంలో అత్యధికంగా 42.3°C నమోదు కాగా, ఆసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో 42°C నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే జగిత్యాల జిల్లా 44.4°C తో అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. ఆదిలాబాద్, నల్గొండ, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 44.3°C వద్ద కొనసాగుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డిహైడ్రేషన్కు గురికాకుండా ఉండటానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నీలిరంగులో మిషన్ భగీరథ నీరు.. ఆందోళనలో చిన్నకోడూరు మండల ప్రజలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha