Hyderabad Crime: హైదరాబాద్ నగరం షేక్‌పేటలో ఒక ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రి చేస్తున్న దారుణమైన రక్తపు దందా వెలుగులోకి వచ్చింది. వీధి కుక్కలను అక్రమంగా బంధించి వాటి రక్తాన్ని భారీ ధరలకు అమ్ముకుంటూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.
జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష ఘటన బయటపడింది. ప్రస్తుతం అధికారులు ఆసుపత్రి రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ వేగవంతం చేశారు
Read also: Vizianagaram Road Accident: టీ స్టాల్‌పైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం!
Dog blood racket investigation Hyderabad
Hyderabad Crime: పెంపుడు కుక్కల యజమానులే లక్ష్యంగా భారీ వసూళ్లు
ఈ ఆసుపత్రి నిర్వాహకులు అమాయక పెంపుడు జంతువుల యజమానులను భయపెట్టి లక్షల రూపాయలు గుంజుతున్నారు. పెంపుడు కుక్కలకు లేని అనారోగ్యాన్ని ఉన్నట్లు నమ్మించి, రక్తం ఎక్కించాలని తప్పుడు రిపోర్టులు సృష్టిస్తున్నారు. బంధించిన వీధి కుక్కల నుండి తీసిన ఒక్కో బ్లడ్ ప్యాకెట్‌ను రూ. 25 వేల వరకు విక్రయిస్తున్నారు. రక్తం తీయడం వల్ల ఆ వీధి కుక్కలు నీరసించి ప్రాణాలు కోల్పోవడం జంతు ప్రేమికులను కలిచివేస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా రక్తం సేకరణపై అధికారుల తనిఖీలు
సాధారణంగా జంతువుల రక్తమార్పిడికి యజమాని అనుమతితో పాటు కఠినమైన నియమాలు ఉంటాయి. కానీ ఇక్కడ అవేవీ పాటించకుండా కేవలం లాభం కోసమే మూగజీవాలను హింసిస్తున్నారు. నగరంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి మాఫియా పుట్టుకొచ్చింది. తనిఖీల్లో లభించిన ఆధారాల బట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

