Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీ స్టాల్‌పైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం!

టీ స్టాల్‌పైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు దుర్మరణం!

వార్త 1 month ago

Vizianagaram Road Accident: విజయనగరం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై అతివేగంతో దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది.

ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

Read Also:Mahabubabad crime: ఇద్దరు కుమారులకు ఉరివేసి తండ్రి ఆత్మహత్య! ఆ ఇంట్లో అసలేం జరిగింది?

Vizianagaram Road Accident: గాలిలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక టీ స్టాల్ లోకి కారు వేగంగా దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు కారు ఢీకొన్న ధాటికి గాలిలో ఎగిరి అవతల పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత కారు అదుపుతప్పి పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.

మృతుల వివరాలు

ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి కూడా మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరిని గుర్తించారు:

  1. శ్రీనివాస్: విశాఖపట్నం నివాసి, ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్.
  2. సింహాచలం: బొబ్బిలి నివాసి.

మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

అతివేగమే ప్రమాదానికి కారణం

కారు డ్రైవర్ నిర్లక్ష్యం మరియు మితిమీరిన వేగమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారు అత్యంత వేగంగా ఉండటంతో లారీని ఢీకొన్న ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చిత్రదుర్గలో బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha