Artificially Ripened Mangoes Seized: హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్‌లో హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో భారీ ఎత్తున కల్తీ మామిడి పండ్లు పట్టుబడటం కలకలం రేపింది.
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రమాదకర రసాయనాలతో మామిడి పండ్లను పండించే స్థావరంపై అధికారులు ఉక్కుపాదం మోపారు.
Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!
Adulterated Mangoes Seized
ఆసిఫ్ నగర్ ఫ్రూట్ వేర్‌హౌస్‌పై దాడులు
హైదరాబాద్ నగరంలో పండ్ల సీజన్ మొదలైన వేళ, కృత్రిమంగా పండించే ముఠాలపై హెచ్-ఫాస్ట్ (Hyderabad Food and Adulteration Surveillance Team) నిఘా పెంచింది. ఆసిఫ్ నగర్‌లోని ఒక పండ్ల గోదాముపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.సుమారు 7 టన్నుల మామిడి పండ్లను అధికారులు సీజ్ చేశారు. ఇవి దాదాపు 350 ట్రేలలో నిల్వ చేసి ఉన్నాయి.ఈ పండ్లను బటాసింగారం మార్కెట్ నుండి తీసుకొచ్చి, ఇక్కడ రహస్యంగా పండిస్తున్నట్లు గుర్తించారు.
Artificially Ripened Mangoes Seized: ప్రమాదకర రసాయనాల వినియోగం
మామిడి పండ్లు త్వరగా పండటానికి, ఆకర్షణీయమైన రంగులోకి రావడానికి నిబంధనలకు విరుద్ధంగా ఇథిలీన్ (Ethylene) వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. రసాయనాలతో పండించిన పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, అలర్జీలు, దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. సేఫ్టీ నార్మ్స్ పాటించకుండా మార్కెట్‌లోకి ఈ పండ్లను సరఫరా చేసేందుకు సిద్ధం చేయడంతో అధికారులు అడ్డుకున్నారు.
గోషామహల్‌లో పోలీసుల మెరుపు దాడులు
నగరంలో మామిడి పండ్ల సీజన్‌ను ఆసరాగా చేసుకుని అక్రమంగా కాసులు సంపాదించుకోవాలని చూస్తున్న వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.గోషామహల్ ప్రాంతంలోని గోదాములపై దాడులు నిర్వహించిన పోలీసులు, భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ మామిడి పండ్లను గుర్తించారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందడానికి పండ్లను విషపూరితం చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

