Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

వార్త 2 months ago

Karimnagar Crime: కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ గ్రామంలో గుండెలను పిండేసే ఘటన వెలుగుచూసింది. కన్నతండ్రే కాలయముడిలా మారి తన ఐదు సంవత్సరాల కవల పిల్లలను పొట్టనబెట్టుకున్నాడు.

కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

Read Also: Masaipeta Sarpanch: పురుగుల మందు తాగి మహిళా సర్పంచ్ బలవన్మరణం!

ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలను తొలుత బావిలోకి తోసేసిన శ్రీశైలం అనే వ్యక్తి.. తర్వాత తాను కూడా బావిలోకి దూకేశాడు. అయితే దూకిన తర్వాత ప్రాణ భయంతో ఈదుకుంటూ బయటకు వచ్చేశాడు. కానీ పాపం.. ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు.. బావి వద్దకు చేరుకుని గాలించారు. ఒక బాలిక మృతదేహం లభించగా.. మరో చిన్నారి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసిన శ్రీశైలాన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Karimnagar Crime: స్థానికుల ఆగ్రహం - పోలీసుల ఎంట్రీ

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మరో చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం భార్యతో శ్రీశైలం గొడవపడినట్లు తెలిసింది. ఈ ఆవేశంలోనే ఇద్దరు కుమార్తెలతో కలిసి బావి వద్దకు చేరుకున్న శ్రీశైలం.. ఆ ఆవేశంలో పసి ప్రాణాలను బలి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు పిల్లలను గడ్డిమందు తాగించి బావిలోకి తోసేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Karimnagar Jubilee Nagar Father Kills Twin Children

ఈ ఘటనపై పోలీసులు మరింత సమాచారం అందించాల్సి ఉంది. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పిల్లల ప్రాణాలు తీశావంటూ శ్రీశైలాన్ని స్థానికులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులు స్థానికులను అడ్డుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీశైలాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమిటనే దానిపై ఆరా తీస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అల్లాదుర్గంలో పోలేరమ్మ దేవతకు బోనాలను, రథాన్ని ఊరేగింపుగా తీసుకు వస్తున్న మహిళలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha