Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో హెచ్‌-ఫాస్ట్‌ భారీ సోదాలు: భారీ కల్తీ మసాలా దినుసులు స్వాధీనం

హైదరాబాద్‌లో హెచ్‌-ఫాస్ట్‌ భారీ సోదాలు: భారీ కల్తీ మసాలా దినుసులు స్వాధీనం

వార్త 2 weeks ago

H-FAST inspections in Hyderabad: హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిన కల్తీ ఆహార పదార్థాల విక్రయాలపై హెచ్‌-ఫాస్ట్‌ (H-FAST) అధికారులు ఉక్కుపాదం మోపారు.

నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించి భారీ స్థాయిలో కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమాచారం ఆధారంగా హెచ్‌-ఫాస్ట్‌ బృందాలు ఈ సోదాలు నిర్వహించాయని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. తనిఖీల్లో 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, విక్రయానికి సిద్ధంగా ఉన్న 89.15 టన్నుల ముడిపదార్థాలను అధికారులు జప్తు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Read Also: Gajularamaram Demolitions: గాజులరామారంలో కూల్చివేతల ఉద్రిక్తత..రోడ్డున పడేసారంటూ బాధితుల కన్నీరు!

 H-FAST inspections in Hyderabad

H-FAST inspections in Hyderabad : మసాలాలలో క్లాత్ డైలు, హెయిర్ కలర్!

వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి రోజువారీ మసాలా దినుసులలో వ్యాపారులు అత్యంత ప్రమాదకర పదార్థాలను కలుపుతున్నట్లు దాడుల్లో తేలింది. మసాలాలకు రంగు, మెరుపు, బరువు పెంచేందుకు ఫ్యాబ్రిక్ డైలు (క్లాత్ డైలు), సింథటిక్ కలర్స్, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ మరియు చివరకు హెయిర్ కలర్ కూడా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించామని, ఆహార భద్రత చట్టం కింద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

తీవ్ర అనారోగ్య సమస్యల ప్రమాదం

కల్తీ మసాలాలు వాడటం వల్ల కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys) దెబ్బతినడమే కాకుండా, క్యాన్సర్, అలర్జీలు మరియు జీర్ణసంబంధిత తీవ్ర వ్యాధులు వస్తాయని అధికారులు హెచ్చరించారు. హెచ్‌-ఫాస్ట్‌ వ్యవస్థ ఏర్పడిన 140 రోజుల్లోనే ఇప్పటివరకు 659 దాడులు నిర్వహించి, 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, మొత్తం 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. త్వరలోనే కల్తీ ఆహార ముఠాలపై చర్యలకు ప్రత్యేక సిట్ (SIT) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలపై అనుమానం ఉంటే వెంటనే 87126 61212 అనే హెచ్‌-ఫాస్ట్‌ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Epaper: epaper.vaartha.com

హైదరాబాద్ లో కొత్త LPG కనెక్షన్ తీసుకోవాలంటే చుక్కలే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha