Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు

హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు

వార్త 2 months ago

TGSRTC Electric Buses: హైదరాబాద్ నగర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన మరియు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించే దిశగా రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది.

నగర వీధుల్లో త్వరలోనే అరవై కొత్త ఎలక్ట్రిక్‌ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. కూకట్‌పల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన ఛార్జింగ్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవం రోజే ఈ పర్యావరణ హిత బస్సులను కూడా ప్రారంభించాలని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మార్పు ద్వారా నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ప్రయాణికులకు నిశ్శబ్దమైన, నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also :Hyderabad Weather: రాబోయే 2 గంటల్లో ఈ జిల్లాల్లో వర్ష సూచన..

 TGSRTC Metro Express Electric Buses: Fares and Routes

TGSRTC Electric Buses: పాత బస్సుల స్థానంలో కొత్త టెక్నాలజీ: రెట్రోఫిట్‌మెంట్‌తో భారీ మార్పులు

కొత్త బస్సుల రాకతో పాటు ప్రస్తుతం వాడుకలో ఉన్న పాత డీజిల్‌ బస్సుల విషయంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన 60 డీజిల్‌ బస్సులను తుక్కు (స్క్రాప్‌) కింద తొలగించాలని, ఇంకా పని చేసే సామర్థ్యం ఉన్న వాటిని జిల్లాలకు తరలించాలని నిర్ణయించారు. దీనితో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరో 21 బస్సులను రెట్రోఫిట్‌మెంట్‌ పద్ధతి ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భవిష్యత్తులో మొత్తం 240 పాత బస్సులను ఇదే తరహాలో విద్యుత్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

చాక్లెట్ ఇస్తానని నమ్మించి యాసిడ్ తాగించిన పిన్ని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha