Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం.. 11 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం.. 11 మంది అరెస్ట్

వార్త 3 weeks ago

Hyderabad Fake Doctors Arrest: హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల దందా మరోసారి వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మెడిసిన్ చదవకుండానే ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న 11 మందిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సహా పలు ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఈ నకిలీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Smart ration cards: తూప్రాన్ లో రేషన్ కార్డుల గందరగోళం

 Medical practice with fake certificates in Hyderabad… 11 arrested.

Hyderabad Fake Doctors Arrest: అల్లోపతి వైద్యం.. నకిలీ డిగ్రీలు

విచారణలో నిందితులకు సంబంధించిన పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు నిందితులు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ యూనివర్సిటీల పేర్లతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు పొంది సొంతంగా క్లినిక్‌లు నిర్వహిస్తుండగా, మరికొందరు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేర్లను వాడుకుంటూ రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఎలాంటి అర్హత లేకపోయినా అల్లోపతి వైద్యం చేస్తూ, రోగులకు విచక్షణారహితంగా మందులు, ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తనిఖీలలో నిందితుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? నకిలీ సర్టిఫికెట్లను ఎక్కడి నుంచి తయారు చేయించి సరఫరా చేస్తున్నారు? ఎంతకాలంగా ఈ దందా సాగుతోంది? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

ప్రజలకు పోలీసుల హెచ్చరికలు

నకిలీ వైద్యుల బాగోతం బయటపడటంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగర ప్రజలకు పలు సూచనలు చేశారు. అర్హత లేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవడం ప్రాణాంతకమని హెచ్చరించారు. రోగులు చికిత్స పొందే ముందు సదరు వైద్యుడి అర్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వివరాలను సరిచూసుకోవాలని స్పష్టం చేశారు. నకిలీ డాక్టర్లపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

తిరుపతి ప్రయాణికులకు గుడ్ న్యూస్: వరంగల్ మీదుగా కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha