Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిపివేత ప్రచారంపై జలమండలి స్పష్టత

హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిపివేత ప్రచారంపై జలమండలి స్పష్టత

వార్త 1 week ago

HMWSSB Clarification: హైదరాబాద్ నగరంలో నీటి సరఫరాకు సంబంధించి వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో తమ పేరుతో ప్రచారమవుతున్న సందేశాలు పూర్తిగా అవాస్తవమని హైదరాబాద్ జలమండలి (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) స్పష్టం చేసింది.

ప్రజలు ఇలాంటి వదంతులను, పుకార్లను అస్సలు నమ్మవద్దని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు భరోసా ఇచ్చారు.

Read Also : Cotton record price: తెల్లబంగారానికి రికార్డు ధర.. అయినా రైతుల్లో నిరాశ

 Water Board clarifies reports on water supply suspension in Hyderabad.

HMWSSB Clarification: వైరల్ అవుతున్న ప్రచారంలో ఏముంది?

ఎల్‌నినో ప్రభావం, తీవ్ర కరవు పరిస్థితుల కారణంగా నవంబర్ చివరి నాటికి హైదరాబాద్ నగరానికి నీటిని అందించే ప్రధాన జలాశయాలు ఎండిపోతాయని, దీంతో నగరంలో నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తారని లేదా తీవ్రమైన ఆంక్షలు విధిస్తారని పేర్కొంటూ గత కొద్ది రోజులుగా ఒక మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సందేశం స్వయంగా జలమండలి జారీ చేసినట్లుగా డిజైన్ చేయడంతో నగర ప్రజల్లో తీవ్ర అయోమయం, ఆందోళన మొదలయ్యాయి.

క్లారిటీ ఇచ్చిన జలమండలి అధికారులు

ఈ వైరల్ ప్రచారంపై తక్షణమే స్పందించిన జలమండలి ఉన్నతాధికారులు, తాము అలాంటి ఎలాంటి హెచ్చరికలు లేదా ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా మెసేజ్‌లో పేర్కొన్న జలాశయాల నీటిమట్టాలు, భవిష్యత్తు నీటి సరఫరా పరిస్థితులకు సంబంధించిన సమాచారం అధికారికమైనది కాదని వివరించారు.

తమ సంస్థ పేరుతో ప్రచారంలోకి వచ్చే ధ్రువీకరించని, ఫేక్ సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని మరియు ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాకు సంబంధించిన ఎలాంటి నమ్మకమైన సమాచారం కోసమైనా జలమండలి విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని నగరవాసులకు సూచించారు.

వృద్ధాశ్రమాలకు ఇక చెక్ పడినట్లే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha