Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో ప్రశ్న రావణ్ ఇంట్లో ఏపీ పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌లో ప్రశ్న రావణ్ ఇంట్లో ఏపీ పోలీసుల తనిఖీలు

వార్త 1 month ago

Prashna Ravan: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే యూట్యూబర్ బత్తుల జోసెఫ్ (ప్రశ్న రావణ్) ఇంట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ శివార్లలోని అమీన్‌పూర్ పరిధిలో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న గన్నవరం పోలీసులు గంటల తరబడి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

భార్య విచారణ.. వీడియో రికార్డింగ్

గన్నవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యుల ప్రత్యేక పోలీసు బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. సోదాలు ముగిసిన అనంతరం ప్రశ్న రావణ్ భార్యను పోలీసులు సుదీర్ఘంగా విచారించి, ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. పారదర్శకత కోసం ఈ సోదాల ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు వీడియో చిత్రీకరించారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులకు అవసరమైన భద్రత, సహకారాన్ని అందించారు.

Prashna Ravan: విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు.. ఇప్పటికే యూఏపీఏ అరెస్ట్

గత రెండు సంవత్సరాలుగా అమీన్‌పూర్‌లోని నరేంద్ర నగర్ కాలనీలో ప్రశ్న రావణ్ నివాసం ఉంటున్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఇతర తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఇన్వెస్టిగేషన్‌లో భాగంగానే ప్రస్తుత సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద గన్నవరం పోలీసులు ఇటీవల రావణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.

మన్ననూర్ పీటిజి గురుకులంలో పుడ్ ఫాయిజన్..26 మంది విద్యార్థులకు అస్వస్థత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha