అన్నంలో పురుగులు వస్తున్నాయన్న పట్టించుకోరు
Mannanur: అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో ప్రభుత్వ గిరిజన పీటీజి బాలుర గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికి పుడ్ ఫాయిజన్ తో 26 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి వెంటనే స్పందించి 108 కి ఫోన్ చేసి హుటాహుటిన అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.
ఆసుపత్రికి చేరుకున్న వెంటనే డాక్టర్లు విద్యార్థులకు చికిత్స అందించారు.విద్యార్థులతో మాట్లాడగా హాస్టల్లో ఉదయం అల్పాహారం కిచిడీ వడ్డించారని తిన్న వెంటనే వాంతులు కడుపు నొప్పి అని తెలిపారు.రోజు అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పిన పట్టించుకోరని ఏం కాదు తిను అని చెప్తారు అన్నారు.

read also: Bandi Bhagirath: బండి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ మంజూరు
Mannanur: ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన ఉన్నతాధికారులు
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన భోజనం వడ్డిస్తున్నాం అని ఒక పక్క చెపుతుంది.ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్న సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.త్రాగు నీటి ట్యాంకులు నెలలకొద్ది శుభ్రం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.విషయం తెలుసుకున్న అధికారులు జిల్లా అదనపు కలెక్టర్ దేవసాయం,అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి,డీఎస్పీ పల్లె శ్రీనివాసులు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పలకరించారు.అనంతరం విద్యార్థులకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వార్డెన్ గీత, ప్రిన్సిపాల్ ను హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ పై డాక్టర్లను వివరణ కోరగా నీటి కలుషితమా ఫుడ్ కలిషితమా తెలియదని రిపోర్టు వచ్చిన అనంతరం స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని చికిత్స అనంతరం పంపించడం జరుగుతుందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకుని వీడియో కాల్ లో డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు అదేవిధంగా ప్రతి విద్యార్థితో మాట్లాడడం జరిగింది.విద్యార్థి సంఘాల నేతలు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రతినిధులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు.

