Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు బంద్!

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 4న మాంసం దుకాణాలు బంద్!

వార్త 2 weeks ago

Meat Shops Closed: పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 4వ తేదీన భాగ్యనగరంలో మాంసం, బీఫ్ విక్రయ కేంద్రాలు మరియు కసాయిశాలలను (Slaughterhouses) మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం లేదా సాధారణ రోజుల్లో కొనుగోలు చేసే నగరం లోని వినియోగదారులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

Read Also:Bank Strike: బ్యాంకింగ్ రంగానికి సమ్మె గండం.. వరుసగా 3 రోజులు బంద్

Meat Shops Closed: జీహెచ్‌ఎంసీ ఆదేశాల ముఖ్యాంశాలు & నిబంధనలు

  • సెప్టెంబర్ 4న బంద్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని మేక, గొర్రె, పశువుల కసాయిశాలలతో పాటు చికెన్, మటన్, బీఫ్ షాపులను రోజంతా మూసి ఉంచాలి.
  • కఠిన చర్యలు తప్పవు: జీహెచ్‌ఎంసీ చట్ట నిబంధనల ప్రకారం జారీ చేసిన ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు తెరిస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
  • పోలీసుల సహకారం: ఈ బంద్ ఆదేశాలు నగర వ్యాప్తంగా పక్కాగా అమలు అయ్యేలా అటెన్షన్ నిఘా ఉంచాలని, అవసరమైన చోట చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు జీహెచ్‌ఎంసీ అధికారులు లేఖలు పంపారు.

Epaper: epaper.vaartha.com

హైస్కూల్ విద్యార్థులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha