Bank Strike: వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయడంతో పాటు, సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మె శంఖారావం పూరించింది.
తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త సమ్మె కార్యాచరణను ప్రకటించింది. ఈ సమ్మె పిలుపు కారణంగా సెప్టెంబర్ నెలలో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
Read Also:Reliance Ice cream : ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్..'బాంబే క్రీమరీ' క్రీమ్ బ్రాండ్
Bank Strike: సమ్మె ప్రణాళిక & బ్యాంకింగ్ సేవలపై ప్రభావం

- సెప్టెంబర్ 11న తొలి విడత బంద్: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11వ తేదీన ఒకరోజు సమ్మె నిర్వహించనున్నట్లు యూనియన్ల సమాఖ్య స్పష్టం చేసింది.
- వరుసగా 3 రోజుల సెలవుల ముప్పు: సెప్టెంబర్ 11 (శుక్రవారం) సమ్మె తర్వాత.. సెప్టెంబర్ 12 (రెండో శనివారం), సెప్టెంబర్ 13 (ఆదివారం) సాధారణ సెలవులు కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీనివల్ల నిధుల బదిలీలు, ఏటీఎంలలో నగదు లభ్యతపై తీవ్ర ప్రభావం పడే చాన్స్ ఉంది.
- మలివిడత సమ్మెల సమయం: ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు వరుసగా మూడు రోజుల పాటు మళ్లీ సమ్మె చేపట్టనున్నారు.
- అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె: అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక (Indefinite) సమ్మెకు దిగుతామని UFBU ప్రతినిధులు హెచ్చరించారు.
Epaper: epaper.vaartha.com

