Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద ఆత్మహత్య

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద ఆత్మహత్య

వార్త 1 week ago

IT Employee Suicide : హైదరాబాద్‌లోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక సంతోషి (28) అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో, రెండున్నరేళ్ల కవల కుమారులు తల్లి ప్రేమకు దూరమై బిక్కుబిక్కుమంటున్నారు. భర్త వేధింపులే ఈ దారుణానికి కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక సంతోషి మరియు వైజాగ్‌కు చెందిన రమాకాంత్ ఎనిమిదేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరు ప్రస్తుతం పోచారం డివిజన్‌లోని గెలాక్సీ టవర్స్‌లో నివాసముంటున్నారు. మౌనిక యాక్సిస్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, భర్త రమాకాంత్ ఇన్ఫోసిస్ సంస్థలో హెచ్‌ఆర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కవల కుమారులు ఉన్నారు.

Godavarikhani: అక్షితరాణి హత్యకేసులో కీలక ట్విస్ట్.. లెక్చరరే నిందితుడు!

 IT Employee Suicide

IT Employee Suicide : ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా మౌనిక అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పిల్లల పెంపకం మరియు ఇతర కుటుంబ విషయాలపై దంపతుల మధ్య కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శనివారం రాత్రి కూడా వీరి మధ్య తీవ్ర వివాదం నడిచినట్లు సమాచారం. అయితే భర్త రమాకాంత్ వేధింపులు తాళలేకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మౌనిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోచారం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపుల ఆరోపణలపై రమాకాంత్‌ను విచారిస్తున్నారు. రెండున్నరేళ్ల చిన్నారి కవలలు తల్లిని కోల్పోయి అనాథలుగా మారడంతో ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.

ప్రాంతీయ కేంద్రంగా వరంగల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha