Dailyhunt
హైడ్రా బాధితులకు ఊరట.. ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు

హైడ్రా బాధితులకు ఊరట.. ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు

వార్త 1 week ago

CM Revanth: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైడ్రా (HYDRAA), ప్రక్రియలో నివాసాలు కోల్పోతున్న పేదల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.

చెరువుల కబ్జాలను తొలగించే క్రమంలో నివాసాలు కోల్పోయిన ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి ప్రభుత్వం తరపున డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం సున్నం చెరువు, రామంతాపూర్ చెరువు బాధితులతో భేటీ అయి స్పష్టమైన హామీ ఇచ్చారు.

పేదల ముసుగులో బడా కబ్జాదారులు ప్రయోజనం పొందకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2024 జూలై 19వ తేదీకి ముందే అక్కడ నివాసం ఉంటున్న వారిని ప్రాథమికంగా గుర్తించనున్నారు. కబ్జాదారుల దుష్ప్రచారానికి తావులేకుండా, కేవలం పొట్టకూటి కోసం వలసవచ్చి గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు.

Read Also: RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

 Relief for Hydra victims: Double bedroom houses for all the poor who lost their homes – CM Revanth Reddy’s decision

CM Revanth: బాధితుల గోడు – ప్రభుత్వ భరోసా

ఈ సమావేశంలో ఉపాధి కోసం నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి జిల్లాలతో పాటు ఏపీ నుంచి వలస వచ్చిన కార్మికులు తమ బాధలను కమిషనర్‌కు వివరించారు. బయట ఇళ్లు అద్దెకు దొరకని పరిస్థితుల్లోనే తాము చెరువుల చెంత చేరామని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల పరిస్థితిని సానుకూలంగా పరిశీలించిన రంగనాథ్, వారికి శాశ్వత గృహవసతి కల్పించి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

హైడ్రా పురోగతి, జాతీయ గుర్తింపు

హైడ్రా ఇప్పటికే నగరం చుట్టూ ఉన్న పదుల సంఖ్యలో చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసి, వేల ఎకరాల ప్రభుత్వ భూమికి రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. కేవలం ఆక్రమణల తొలగింపుకే పరిమితం కాకుండా, చెరువుల పునరుద్ధరణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల చెన్నై నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం హైడ్రా పనితీరును పరిశీలించి, తమ నగరాల్లోనూ ఇలాంటి వ్యవస్థ అవసరమని ప్రశంసించడం విశేషం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కవిత పార్టీలోకి చేరికల జోరు.. త్వరలోనే అనుచరులతో మాజీ మంత్రి చేరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha