HYDRA Ranganath: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో భారీ ఊరట లభించింది.
రంగనాథ్‌ను కమిషనర్ పదవి నుంచి తప్పించి, మరొక అధికారిని నియమించాలని గతంలో సింగిల్ బెంచ్ జారీ చేసిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ మంగళవారం సస్పెండ్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also :HYDRA Ranganath:హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

HYDRA Ranganath: కోర్టు విచారణ వివరాలు
- సింగిల్ బెంచ్ ఆదేశాల నిలిపివేత: శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కోర్టు ధిక్కరణ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీనివల్ల రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
- తదుపరి విచారణ: ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

