Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

వార్త 1 week ago

HYDRAA Commissioner: తెలంగాణ ప్రాజెక్ట్ 'హైడ్రా' (HYDRAA) కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన కోర్టులో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేశారు.

తనకు కోర్టుల అన్నా, న్యాయవ్యవస్థ అన్నా ఎంతో నమ్మకముందని మరియు గౌరవముందని ఆ అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్నారు.

Read Also :SC On Paper Leak Protests : శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

లోతుకుంట భూముల్లోకి వెళ్లలేదు!

సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట వద్ద ఉన్న సర్వే నెంబర్లు 1, 2లోని 40 ఎకరాల స్థల వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తాము ఆ 40 ఎకరాల భూమిలోకి వెళ్లలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని కోర్టును కోరారు.

HYDRAA Commissioner: 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై హైకోర్టు ప్రశ్నలు

ఇదే సమయంలో విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఇప్పటివరకు 63 కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్లు దాఖలయ్యాయని ఉన్నత న్యాయస్థానం గుర్తుచేసింది. అసలు ఒకే అధికారిపై ఇన్ని సంఖ్యలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు దాఖలవుతున్నాయి? అని ప్రభుత్వ న్యాయవాదిని (Government Pleader) హైకోర్టు ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లేదా ఆక్రమణల తొలగింపు చర్యలు చేపడుతున్నప్పుడు చట్టపరమైన ప్రక్రియలను, కోర్టు ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని న్యాయస్థానం సూచించింది.

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha