SC On Paper Leak Protests : శాంతియుతంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టడం భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల గొంతును నొక్కేలా పోలీసులు ప్రవర్తించకూడదని సూచించింది. ఆందోళనలు జరుగుతున్నాయనే సాకుతో పోలీసులు పౌరులపై లేదా విద్యార్థులపై అతిగా బలప్రయోగం చేయడం ఏమాత్రం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై స్పందిస్తూ, శాంతియుత నిరసనలను అణచివేసేలా పోలీసులు ప్రవర్తించడాన్ని సమర్థించలేమని ఘాటుగా వ్యాఖ్యానించింది.
Read Also: NEET Student Suicide: ఏదైనా తప్పు చేస్తే క్షమించండి.. మరో నీట్ స్టూడెంట్ సూసైడ్
SC On Paper Leak Protests
SC On Paper Leak Protests : దేశవ్యాప్తంగా ఏకరీతి మార్గదర్శకాలకు పరిశీలన
శాంతియుత నిరసనల సమయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై దేశవ్యాప్తంగా వర్తించేలా ఏకరీతి మార్గదర్శకాలు (Uniform Guidelines) మరియు ప్రామాణిక ప్రోటోకాల్‌ను రూపొందించే అంశాన్ని కోర్టు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. దీనివల్ల అటు నిరసనకారుల హక్కులు పరిరక్షించబడటంతో పాటు, ఇటు శాంతిభద్రతల పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. నీట్-యుజీ ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన శాంతియుత ఆందోళనలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగానే అత్యున్నత నాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
Epaper: epaper.vaartha.com

