NHAI Emergency Rule: జాతీయ రహదారులపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిన వైద్య సహాయం అందించి ప్రాణాలు కాపాడేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
నేషనల్ హైవేలపై ప్రమాదం జరిగిన సమాచారం అందగానే 10 నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ ఘటనా స్థలానికి తప్పనిసరిగా చేరుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితులను ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’ వ్యవధిలో, అంటే సరిగ్గా 1 గంటలోపు సమీప ఆసుపత్రికి తరలించడమే లక్ష్యంగా ఈ నిబంధనలను కఠినతరం చేశారు.
Read Also : PG scholarships: పీజీ విద్యార్థులకు పదిహేను వేల స్కాలర్‌షిప్
Ambulance on the highway within 10 minutes of an accident-or else a fine!
NHAI Emergency Rule: జరిమానా నిబంధనలు, ‘1033’ హెల్ప్‌లైన్
ఈ నూతన నిబంధనల ప్రకారం.. అత్యవసర కాల్‌ను తిరస్కరించినా లేదా ప్రమాద స్థలానికి అంబులెన్స్ చేరుకోవడంలో ఆలస్యం చేసినా రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుందని అధికారులు స్పష్టం చేశారు. అంబులెన్సుల కదలికలు, స్పందించే సమయం, బాధితులను ఆసుపత్రికి తరలించే ప్రక్రియ మొత్తాన్ని GPS, IoT పరికరాల సహాయంతో ఎన్‌హెచ్‌ఏఐ నేరుగా పర్యవేక్షిస్తుంది. జాతీయ రహదారులపై అత్యవసర సహాయం, ప్రమాద సమయాల్లో సమాచారం అందించడం కోసం ‘1033’ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
డయాలసిస్‌కు చెక్.. శరీరంలోనే రక్తాన్ని శుద్ధి చేసే కృత్రిమ కిడ్నీ?

