Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డయాలసిస్‌కు చెక్.. శరీరంలోనే రక్తాన్ని శుద్ధి చేసే కృత్రిమ కిడ్నీ?

డయాలసిస్‌కు చెక్.. శరీరంలోనే రక్తాన్ని శుద్ధి చేసే కృత్రిమ కిడ్నీ?

వార్త 1 week ago

Holly Artificial Kidney: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బాధితులు డయాలసిస్ కోసం వారానికి రెండు, మూడు సార్లు ఆసుపత్రుల చుట్టూ తిరగడం, గంటల తరబడి సూదుల బాధను భరించడం మనం చూస్తుంటాం.

ఈ నిరంతర అవస్థలకు మార్పు తెచ్చే దిశగా ఓ కొత్త కృత్రిమ మూత్రపిండం ఆశలు రేపుతోంది. 'హోల్లీ' (Holly) పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ పరికరాన్ని శస్త్రచికిత్స ద్వారా నేరుగా శరీరంలోనే అమర్చవచ్చు. సహజమైన కిడ్నీల తరహాలోనే ఇది 24 గంటలూ శరీరంలోనే ఉంటూ నిరంతరం రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా రూపొందిస్తున్నారు. పెల్విస్ ప్రాంతంలోని రక్తనాళాలకు దీనిని అనుసంధానిస్తారు.

Read Also : Chia Seeds and Lemon Water: రోజూ ఉదయాన్నే చియా సీడ్స్‌, నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

Holly Artificial Kidney: రోజువారీ జీవితానికి వెసులుబాటు.. భారత్‌లోనూ క్లినికల్ ట్రయల్స్

ఈ పరికరం అందుబాటులోకి వస్తే రోగులు తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. నీటిని తొలగించే ప్రక్రియ శరీర అవసరాలకు అనుగుణంగా జరుగుతుందని, దీనివల్ల ప్రయాణాలు, ఉద్యోగం, రోజువారీ పనులను అభ్యంతరం లేకుండా కొనసాగించవచ్చని రూపకర్తలు వెల్లడించారు. కిడ్నీ మార్పిడి కోసం వేచి చూసే వారికి కూడా ఇది తాత్కాలికంగా ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ప్రస్తుతం 'హోల్లీ' అభివృద్ధి దశలోనే ఉండగా, దీని తయారీని కొచ్చి, బెంగళూరు, ముంబయి నగరాల్లో చేపడుతున్నారు. భారత్‌లోనూ దీని మానవ క్లినికల్ పరీక్షలు (Clinical Trials) నిర్వహించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే డయాలసిస్ బాధితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

సామాన్యుడి నెత్తిపై ధరల పిడుగు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha