Narsapur Food Poisoning : వివాహం సందర్భంగా ముందు రోజున హల్దీ వేడుకలో పాల్గొని హల్ది వేడుకలో తిన్న ఆహారం వికటించి 41 మంది అస్వస్థతకు గురైన సంఘటన నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
ఈ సంఘటన వివరాలు నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో కంప్యూటర్ సెంటర్ నిర్వహించే మహమ్మద్ అవేజ్ వివాహం ఆదివారం రోజున జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ముందు రోజున హల్దీ వేడుకలతో పాటు గృహప్రవేశ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు.
Read Also:road accident: నిర్లక్ష్యానికి మూల్యం
Narsapur Food Poisoning: 41 people fall ill after consuming food during Haldi ceremony
ఈ వేడుకలకు తమ సమీప బంధువులను ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించారు. ఈ వేడుకలకు హాజరైన వారంతా మాంసాహారం భోజనం చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే అందరూ వాంతులు వీరేశనాలతో బాధపడుతూ సుమారు 41 మంది అస్వస్థతకు గురై నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కొందరు ఆరోగ్యం కుదుటపడడంతో అదే రాత్రి ఇంటికి వెళ్లిపోయారు. ఇందులో 9 మంది ఈ ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్నారు. ఇందులో కూడా ముగ్గురు పిల్లల ఆరోగ్యం క్షీణించడంతో సంగారెడ్డి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు అందరి ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉందని ఎవరికి ఎలాంటి ప్రమాదము లేదని డాక్టర్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
https://vaartha.com/national/uttar-pradesh-pension-fraud-meerut-man-draws-dead-mothers-pension-for-seven-years-fraud-worth-44-lakhs/676579/

