Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హత్యకు గురైందనుకున్న యువతి సజీవంగా ప్రత్యక్షం..ఎక్కడంటే?

హత్యకు గురైందనుకున్న యువతి సజీవంగా ప్రత్యక్షం..ఎక్కడంటే?

వార్త 2 weeks ago

Maharashtra Crime: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగిన ఒక హైడ్రామా క్రైమ్ స్టోరీ పోలీసులకే ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చింది. హత్యకు గురైందని భావించి, అంత్యక్రియలు కూడా ముగించి, కేసులో తండ్రి, తమ్ముడిని జైలుకు పంపిన ఓ కేసులో ఊహించని మలుపు తిరిగింది.

చనిపోయిందనుకున్న 26 ఏళ్ల యువతి నిక్షేపంగా ప్రాణాలతో తిరిగి వచ్చింది.

అసలు ఏం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్‌కు చెందిన శివాని అనే 26 ఏళ్ల యువతి మే 1వ తేదీన కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు ఖక్నార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో, మే 9న అదే ప్రాంతానికి చెందిన అరుణ్ అనే యువకుడు కూడా అదృశ్యమయ్యాడు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని జలగావ్ సరిహద్దుల్లో తల లేని, సగం కాలిన స్థితిలో ఉన్న ఒక గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read also: Siddaramaiah Resign: సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం

Maharashtra Crime: డీఎన్ఏ టెస్ట్ చేయకుండానే అరెస్టులు!

జలగావ్ పోలీసులు ఆ మృతదేహం అదృశ్యమైన శివానిదేనని తొందరపడి నిర్ధారణకు వచ్చారు. కన్నకూతురిని పరువు హత్య (Honor Killing) చేశారనే అనుమానంతో శివాని తండ్రి బాపురం కల్మేకర్, సోదరుడు అజయ్ కల్మేకర్‌లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే, కనీసం డీఎన్ఏ పరీక్ష కూడా నిర్వహించకుండా పోలీసులు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

ఈ విషయమై బుర్హాన్‌పూర్ ఎస్పీ అశుతోష్ బగ్రీ మాట్లాడుతూ.. బయోమెట్రిక్ ఆధారాల ద్వారా సదరు యువతి శివానియేనని నిర్ధారించుకున్నామని తెలిపారు. ఒకే వ్యక్తి ఒక రాష్ట్రంలో హత్యకు గురైనట్లు రికార్డుల్లో ఉండి, మరో రాష్ట్రంలో ప్రాణాలతో తిరగడం అత్యంత విచిత్రమైన పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం యువతిని జలగావ్ పోలీసులకు అప్పగించామని, అసలు ఆ శవం ఎవరిదనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు తదుపరి విచారణ జరుపుతారని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ట్రబుల్ షూటర్ నుంచి సీఎం వరకు.. డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha