ఇరాన్‌పై మంగళవారం జరపాల్సిన సైనిక దాడిని వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' ద్వారా ప్రకటించారు.
టెహ్రాన్‌తో తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. మధ్యప్రాచ్యంలోని కీలక మిత్రదేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాల నాయకులు అమెరికాను సంప్రదించి, చర్చల ద్వారా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావించడం వల్లే దాడిని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ట్రంప్ వివరించారు. అమెరికాకు ప్రయోజనకరంగా ఉండేలా, ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా నిలువరించేలా ఈ ఒప్పందం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, దాడి వాయిదా పడినప్పటికీ ఇరాన్‌పై సైనిక ఒత్తిడిని ట్రంప్ తగ్గించలేదు.
Iran-America War
Iran-America War: భారీ ఎత్తున వైమానిక, సైనిక దాడులకు సిద్ధం
ఒకవేళ చర్చలు విఫలమై, సరైన ఒప్పందం కుదరని పక్షంలో ఏ క్షణంలోనైనా ఇరాన్‌పై పూర్తిస్థాయి, భారీ ఎత్తున వైమానిక, సైనిక దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డానియల్ కేన్‌లను ఆదేశించారు. గత వారాంతంలో కూడా ట్రంప్ స్పందిస్తూ..ఇరాన్‌కు సమయం ముగిసిపోతోంది, వారు వేగంగా కదలడం మంచిది, లేకపోతే వారి ఉనికికే ప్రమాదం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సంక్షోభంలో తెరవెనుక తీవ్రమైన దౌత్యపరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

