Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హనీ ట్రాప్ కేసులో పోలీసులపై వేటు.. నలుగురు డిస్మిస్

హనీ ట్రాప్ కేసులో పోలీసులపై వేటు.. నలుగురు డిస్మిస్

వార్త 1 month ago

Anantapur Honeytrap Case: అనంతపురం జిల్లాను వణికించిన హనీట్రాప్ వ్యవహారంలో ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నేరగాళ్లతో చేతులు కలిపి సెటిల్మెంట్లు చేసిన నలుగురు పోలీసు సిబ్బందిని ఉద్యోగాల నుండి పూర్తిగా తొలగించారు.

ఇందులో రాప్తాడు సీఐ శ్రీహర్షతో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, దేవలా నాయక్ ఉన్నారు. నిందితుల నుంచి పోలీసుల ఖాతాల్లోకి లక్షల రూపాయలు బదిలీ అయినట్లు విచారణలో సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో ఈ వేటు పడింది.

Read also: Sangareddy Crime: సింగూర్ ప్రాజెక్టులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

 Police officers dismissed in honeytrap case

Anantapur Honeytrap Case: ఖాతాల్లోకి లక్షల నగదు.. అధికారుల కొరడా

ఈ ముఠా నాయకుడు రంగమ్మనాయుడితో కొందరు అధికారులు అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ విచారణలో తేల్చారు. బాధితుల ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులకే కొమ్ముకాస్తూ పంచాయితీలు చేసిన ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్ సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు మరో సీఐని వేకెన్సీ రిజర్వ్‌కు పంపగా, ఇంకొకరిని డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. పోలీసు శాఖలో ఈ పరిణామాలు పెద్ద దుమారం రేపాయి.

కోటి రూపాయల దోపిడీ.. బయటపడ్డ నిజాలు

హనీట్రాప్ ముఠా ఇప్పటివరకు సుమారు 20 మంది బాధితుల నుండి కోటి నాలుగు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు లేని వారి వద్ద నుంచి బలవంతంగా రాయించుకున్న ప్రామిసరీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకుని చించివేశారు. నిందితుల వద్ద నుండి 13 లక్షల నగదు, కత్తులు, సెల్‌ఫోన్లు లభించాయి. రాజకీయ నేతలతోనూ ఈ ముఠాకు సంబంధాలు ఉన్నట్లు చర్చ జరుగుతుండటంతో, రానున్న రోజుల్లో మరికొందరిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా..? పుచ్చకాయ ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha