Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హనీ ట్రాప్ విచారణలో ట్విస్ట్ మీద ట్విస్ట్

హనీ ట్రాప్ విచారణలో ట్విస్ట్ మీద ట్విస్ట్

వార్త 2 months ago

కస్టడీలో కింగ్ పిన్ నరేంద్రరెడ్డి

Honey Trap Case Investigation: సంచలనం సృష్టించిన హాని ట్రాప్ కేసు పూటకో ట్విస్ట్ మీద ట్విస్ట్గా నిలుస్తోంది.

ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారితో రహస్య విచారణకు శ్రీకారం చుట్టారు. వండలమంది బాధితులు ఈ ఉచ్చులో పడి సర్వం కోల్పోయారు. ధైర్యం చేసి 20 మంది ముందుకు రాగా కేసులు, కోర్టు వివాదాల్లో ఎందుకని చాలా మంది వెనుకడుగు వేశారు. వీరంతా తెరపైకి వస్తే కోట్లాది రూపాయలు దోచుకున్న వాగోతం బయటకు వస్తుంది. ఇప్పటికే రూ.1.4 కోట్ల దాకా లావాదేవీలు జరిగాయని అనంతపురం రూరల్ డీ ఎస్సీ శ్రీనివాసులు స్పష్టం చేసారు. రుద్రంపేట మాజీ ఉపసర్పంచ్ నరేంద్ర రెడ్డి కింగ్ పిన్గా చెలామణి అయ్యాడు.

Read Also : Human Trafficking awareness: మానవ అక్రమ రవాణాపై రాయపాటి శైలజ హెచ్చరిక

 Honey Trap Case Investigation

Honey Trap Case Investigation: క్యూలో మరో 40 మంది ఇంటి దొంగలు

దీంతో అతియాన్ రంగమ్మ నాయుడుతో విభేదాలు ఏర్పడ్డాయి. ఆర్థిక లావాదేవీలు వీరి మధ్య బెడిసి కొట్టాయి. దీంతో ఆమె నుండి విడిపోయి కొత్తగా పాసి డ్రాప్ ను ఇద్దరు యువతులతో కలిసి షురూ చేసాడు. ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ మరింతగా స్పీడ్ అందుకుంది. ఈ గలీజ్ దందాలో ముందుగా తెరపైకి హనీ ట్రాప్ ముఠానే అని భావించారు. కానీ తెర వెనుక వీరితో కీలక సంబంధాలు పెట్టుకున్న ఇంటి దొంగలు కూడా ముందు వరుసలో ఉన్నారు. 30 నుండి 40 మంది దాకా వీరితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో బహిర్గ తమైనట్లు తెలిసింది.

ఈ పానీ క్రీడలో ఇప్పటికే ఇద్దరు సిఐలు ఔట్ అయ్యారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్, రాప్తాడు సీఐ శ్రీహర్షకు కర్నూలు రేంజ్ దీఐజీ ఎదుట హాజరు కావాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇంకా కొందరు సిఐలు, ఎస్బీలు, హెడ్ కానిస్టేబుళ్లు, పదుల సంఖ్యలో కానిస్టేబుళ్ళు ఉన్నట్లు అధికారులు ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొందరు లేడి డాన్ చిన్ని అలియాన్ రంగమ్మ నాయుడుతో కలిసి పంచాయతీలు, సెటిల్మెంట్లు చేయడం, మరికొందరు అమ్మాయిలతో కలిసి విలాసాల కోసం టూర్లకు వెళ్లడం జరిగినట్లు బహితమైంది. అనంతపురం రూరల్, రాప్తాడు ఇటుకులపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ముఠా సభ్యులతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు పొక్కింది. వీటిని ఆధారంగా చేసుకుని అధికారులు విచారణ వేగవంతం
చేశారు.

ఖాకీ వర్గాల్లో కలకలం – రాజకీయ రంగు

దీంతో పోలీసు వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. హనీ ఉచ్చు ఎవరెవరి మెడకు చుట్టుకుం టుందోనని ఖాకీలు కలవరపాటుకు గురవుతున్నారు. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోననే చర్చ పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో సంబంధాలు ఉన్న వారికి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న భయాందోళ నలు వారిలో వెంటాడుతూనే ఉన్నాయి. ఈ అంశు ప్రస్తుతం అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో రుద్రంపేట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గా పనిచేసిన నరేంద్ర రెడ్డి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది.

దీంతో హనీ దందా కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో కొత్త మలుపులు తిరిగింది. ఈ పాపంలో కింగ్ పిన్ గా వ్యవహరించిన నరేంద్ర రెడ్డి వారితో సన్నిహితంగా ఉండే వారి కార్యకలాపాల్లో ఈయన హస్తం ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం వున్న హనీ గ్యాంగ్ విభేదాలొచ్చాయి. దీంతో చీలిక ఏర్పడి ఇద్దరు యువతులతో కలిసి సొంతంగా కొత్త దందాకు తెర లేపారు. సంపన్న వర్గాల నుండి లక్షల రూపాయలు దోచుకున్నారు. దీంతో పోలీసులు ఈయనను అదుపులోకి తీసుకుని విదారిస్తున్నట్లు సమాచారం. చరేంద్ర రెడ్డి పాత్ర ముఠా సభ్యులకు ఏ స్థాయిలో ఉందో, సంపన్నుల నుండి నేరుగా ముఠాతో చేతులు కలిపి లక్షణాలు బక్షలు గుంజినట్లు సాగుతున్న ప్రచారం కూడా లేకపోలేదు.

ఖైదీలుగా మారిన నిందితులు – రాజకీయ రంగు

ఇదిలా ఉండగా హనీ ట్రాప్ కేసులో మరో నలుగురు నిందితులైన దబ్బర రాజేష్ నాయుడు, చంద్రకళ, జయమ్మ, అనంత కుమారిలను పోలీసులు శుక్రవారం జిల్లా కోర్టు ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి వీరికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అయితే ఈ నేరాల్లో కీలక పాత్ర పోషించిన ఆ ఇద్దరు సీలలను కేవలం వేకెన్సీ రిజర్వ్ తోనే సరిపెట్టి చేతులు దులుపుకున్నారనే అపవాదులు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేరాలు చేసిన నిందితులకు భారతీయ శిక్షాస్మృతి సమానంగా ఉంటుందని, మరి పోలీసు అధికారులకు ఈ చట్టాలు వర్తిండవా? అని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే చట్టాలను తమ చుట్టాలు రాగా మార్చుకోవడం పోలీసు శాఖరీ చెల్లుబాటు అవుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే నిన్న భయంతో భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జోలికి వెళ్లకుండా ఉండేందుకు శిక్షలు పౌరులతో సమానంగా అందరికీ ఒకేలా వర్తించేలా చర్యలు తీసుకోవాలని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పార్టీల మధ్య విమర్శల పర్వం

ఇదిలా ఉండగా పోలీసులు అదుపులో ఉన్న రుద్రంపేట మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డి గురించి భిన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగర మాజీ మేయర్ వసీం, వైసిపి నగర అధ్యక్షునితో మీడియా సమావేశం నిర్వహించారు. నరేందర్ రెడ్డికి గత నాలుగేళ్ల కిందటే వైసిపి దూరం పెట్టిందని చెప్పారు. మీడియాలో వైసిపి నాయకుడని పదేపదే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నరేందర్ రెడ్డి కి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాడని, అతను టిడిపి పార్టీకి చెందిన వాడుగా వ్యాఖ్యానించారు. అయితే వరేండర్ రెడ్డిన పార్టీకి దూరం పెట్టామంటూ టిడిపి నాయకులు ఖండించారు. ఇలా ఇరు పార్టీల వారు నరేందర్ రెడ్డి తమ పార్టీకి చెందిన వాడు కాదంటూ వరస్పర వ్యాఖ్యానాలు చేయడంతో పొలిటికల్ హీట్ ఎక్కింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా విషాదం..ఐదుగురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha