ఎపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ
Human Trafficking awareness: మానవ అక్రమ రవాణా అంటే.. ఒకే రకమైన నేరం కాదని, ఇది అనేక రూపాల్లో జరుగుతుందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు.
విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. పలు మార్గాల్లో ట్రాఫికింగ్ జరుగుతుంతోందని వెల్లడించారు. ముఖ్యంగా, బాధితులను గుర్తించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రాఫికింగ్ మాఫియా తమ విధానాలను మార్చు కుంటున్నాయని, సోషల్ మీడియా ద్వారా కూడా యువతను టార్గెట్ చేస్తున్నాయని తెలిపారు.
Read Also : Malaria Free Districts in AP: పశ్చిమగోదావరి, కోనసీమ, బాపట్ల జిల్లాలు మలేరియా రహితం
Human trafficking is a crime: AP Women’s Commission Chairperson Rayapati Sailaja
Human Trafficking awareness: విద్యార్థులపై సైబర్ నేరాల ప్రభావం
ముఖ్యం గా బీటెక్ చదువుతున్న విద్యార్థులను విదేశాలకు తీసుకెళ్లి, వారిని సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారన్నారు. ఇది సాధారణంగా కనిపించని కొత్త రకం ట్రాఫికింగ్ అని, దీనిపై ప్రత్యేక అవగాహన అవసరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మనుషుల అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)పై అవగాహన పెంచేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ కీలక కార్యక్రమాలు చేపడుతున్నారు. విజయవాడ స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ హాల్లో శుక్రవారం మహిళల రక్షణపై ట్రాఫికింగ్ను అరికట్టండి రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా (ట్రాఫికింగ్) చేయడం ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీహ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని తెలిపారు.
సాంకేతికతతో నిఘా, బాధితులకు భరోసా
బాధితులతో, ముఖ్యంగా ట్రామాలో ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, కేసులను ఎలా విచారిం చాలి, వారి నుంచి కీలక సమాచారాన్ని ఎలా సేకరించాలి వంటి అంశాలపై సమగ్రంగా ఈ కార్యక్రమంలో అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫికింగ్పై ప్రజల్లో అవగాహన పెంపుతో పాటు, గుర్తింపు విధానాలపై కూడా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాయపాటి శైలజ తెలిపారు. ట్రాఫికింగ్ బాధితులను గుర్తించడం మాత్రమే కాకుండా, వారిని సైకలాజికల్గా ఎలా డీల్ చేయాలో కూడా ఈ కార్యక్రమంలో వివరించామని రాయపాటి శైలజ పేర్కొన్నారు. బాధితులు మానసికంగా చాలా ఒత్తిడిలో ఉంటారని, అందుకే వారికి సహాయం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు టెక్నాలజీని కూడా ఉపయో గిస్తున్నట్లు వెల్లడించారు.
సమిష్టి బాధ్యత, శిక్షణ
ముఖ్యంగా విశాఖపట్నంలో రోబోటిక్ సిస్టమ్ ద్వారా అనుమా నాస్పద వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు జరుగు తున్నాయని తెలిపారు. ఇది భవిష్యత్తులో ట్రాఫికింగ్ తన్ను అరికట్టడంలో కీలక పాత్ర పోషించవచ్చని అభిప్రాయవడ్డారు. కేవలం పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవా లని పిలుపు నిచ్చారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిం చారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని, సోషల్ మీడియాలో అపరిచితు లతో సంబంధాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఇలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే ట్రాఫికింగ్ను తగ్గించవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఆర్సీఎఫ్ ఎస్పీ షణ్ముఘం మాట్లాడుతూ స్త్రీ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు వివరించారు. మాజీ ఐపీఎస్ అధికారి పి.ఎం. నాయర్ శిక్షకుడిగా వ్యవహరించి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో రైల్వే డివిజనల్ మేనేజర్, ఆర్పీఎఫ్, జీఆర్పీ, మహిళా అభివృద్ధి శాఖ (జూదిదీ), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

