Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హనుమకొండ మానస హత్య కేసు: తండ్రే సూత్రధారి

హనుమకొండ మానస హత్య కేసు: తండ్రే సూత్రధారి

వార్త 3 weeks ago

Hanamkonda Crime : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైన ఘటనను పోలీసులు ఛేదించి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.

మృతురాలిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానస (33)గా పోలీసులు గుర్తించారు. విడాకుల అనంతరం కరీంనగర్‌కు చెందిన వినోద్ కుమార్‌తో మానస సన్నిహితంగా ఉంటోంది. అతడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేగా, వినోద్ ఈ విషయాన్ని మానస తండ్రి రాజేశం దృష్టికి తీసుకెళ్లాడు. కుటుంబ పరువు తీస్తోందనే ఆగ్రహంతో, ఆమెను చంపేయాలని ప్రియుడు వినోద్‌ను మానస తండ్రే ఆదేశించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మానసను గొంతు నులిమి చంపిన వినోద్, మృతదేహాన్ని కారు డిక్కీలో దాచి పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆమె మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచి, ఎల్కతుర్తిలోని తన ఇంటి పరిసరాలకు తీసుకెళ్లాడు. మృతదేహాన్ని పూడ్చి పెట్టడానికి ఏర్పాట్లు చేస్తుండగా స్థానికులు దుర్వాసనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఎల్కతుర్తి శివార్లలో వినోద్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం.. 11 మంది అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha