Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'హర్ ఘర్ తిరంగా'లో ప్రజలంతా పాల్గొనాలి.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

'హర్ ఘర్ తిరంగా'లో ప్రజలంతా పాల్గొనాలి.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

వార్త 2 weeks ago

PM Modi: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమంలో ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులకు నివాళులర్పించాలని కోరారు. ''హర్‌ ఘర్‌ తిరంగా.. ఘర్‌ ఘర్‌ తిరంగా.. హర్‌ మన్‌ తిరంగా'' అంటూ దేశప్రజల్లో జాతీయభావాన్ని, స్ఫూర్తిని నింపారు.

Read Also : Drug addiction : యువశక్తికి మత్తు సంకెళ్లు, వికసిత్ భారత్కు ముప్పు

 Everyone should participate in 'Har Ghar Tiranga': Prime Minister Narendra Modi

PM Modi: ఇన్‌స్టాగ్రామ్ రీల్ అండ్ 'ఎక్స్' వేదికగా సందేశం

ఆగస్టు 15న ప్రతి ఇంటా పండుగలా జరుపుకోవాలని సూచిస్తూ ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక రీల్‌ను షేర్ చేశారు. జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణానికి పునరంకితం అవుతామని ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గర్వానికి ప్రతీక అని, దేశం కోసం అత్యుత్తమంగా పనిచేయాలనే నిరంతర స్ఫూర్తిని అది అందిస్తుందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరించారు.

'వందేమాతరం' 150వ వార్షికోత్సవానికి అంకితం

ఈ ఏడాది నిర్వహిస్తున్న 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందని, దీనిని 'వందేమాతరం' 150వ వార్షికోత్సవానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశభక్తిని, త్రివర్ణ పతాకంపై ఉన్న గౌరవాన్ని, మాతృభూమిపై ప్రేమను చాటుకునేలా ఈ వేడుకలను నిర్వహించాలని సూచించారు.

'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా ప్రారంభమైన ఈ 'హర్‌ ఘర్‌ తిరంగా' ఉద్యమం ద్వారా ప్రతీ పౌరుడికి జాతీయ పతాకంతో ఉన్న వ్యక్తిగత అనుబంధం, గౌరవం మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha