Drug addiction : సమగ్ర ప్రగతికి, సుస్థిర వికాసానికి, ఆర్ధిక పురోగతికి భావి భారత పౌరులే ప్రధాన శక్తులు. 'యువతయే దేశానికి వెన్నెముక అనే ఆర్యోక్తి ఊరికే రాలేదు.
నేడు జగత్తులోనే అత్యధికంగా పాతికేళ్ల లోపు వయస్సు ఉన్న యువజన జనాభా కలిగిన సమ్మోహన శక్తిన కలిగిన ఏకైక దేశం మన భారతదేశం. ఈ అనంతమైన శారీరక, మాన సిక, సృజనాత్మక శక్తి సరైన దిశలో వయనిస్తే ‘వికసిత భారత్ 2047 స్వప్నం నెరవేరడం తథ్యం. కానీ, సరిగ్గా ఇదే సమయంలో మన దేశ ప్రగతిని దెబ్బతీయడానికి, భవి ష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి మాదకద్ర వ్యాలనే విష నాగులు సమాజంలోకి జొరబడుతున్నాయి. ఈ వ్యసన భూతం కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యానికే పరిమితం కాకుండా కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నంచేస్తూ, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, అంతిమంగా దేశ ఆర్ధిక పురోగతికి తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది. నూతన యుగంలో సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తోందో, అంతే వేగంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థ రూపాం తరం చెందుతోంది.
Drug addiction
Drug addiction : శత్రుదేశాల కుట్రలు
చీకటి జాలం, గూఢ ధనాలు, సామా జిక మాధ్యమాలను వేదికగా చేసుకుని కృత్రిమ మత్తు పదా ర్థాలు, రసాయన మత్తు బిళ్లలు, హెరాయిన్ వంటి ప్రమాద కర పదార్థాలు నేడు విద్యాసంస్థల ముంగిటకు చేరుతున్నా యి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పై కోట్లకు పైగా ప్రజలు వివిధ రకాల మాదకద్రవ్యాల బారిన పడి ఉన్నారు. భారతదేశ విషయానికి వస్తే, జాతీయ స్థాయిలో నిర్వహించి న సర్వే ప్రకారం దేశంలో సుమారు మూడు కోట్ల మందికి పైగా గంజాయిని, రెండుకోట్ల మందికి పైగా ఆఫీము ఆధా రిత పదార్థాలను, దాదాపు కోటి మందికి పైగా వివిధ రకాల ప్రమాదకర నిద్రమాత్రలను వినియోగిస్తున్నారు. ఇందులో అత్యధిక భాగం వదిహేను నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు గల పాఠశాల, కళాశాల విద్యార్థులు, నిరుద్యోగ యువత, పట్టణ ప్రాంతవాసులే ఉండటం అత్యంత విచారకరం. మత్తు పదార్థాల వ్యాపారం కేవలం స్వదేశీ విక్రేతల వ్యాపారం మాత్రమే కాదు, దీని వెనుక అంతర్జాతీయ నేర ముఠాలు, సరిహద్దు అవతలి శత్రుదేశాల కుట్రలు దాగి ఉన్నాయి. దీనినే ‘మత్తు తీవ్ర వాదం’ అంటారు.
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణాన్ని
పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ తీరప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల గుండావిమాన ర హిత యంత్రాలు, సముద్ర మార్గాలు, రవాణా వాహనాల ద్వారా దేశంలోకి వేల కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను తోస్తున్నారు. భారతదేశ యువశక్తిని మానసి కంగా, శారీరకంగా వికలాంగులను చేయడం ద్వారా భారత ప్రజాస్వామిక, ఆర్థిక శక్తులను బలహీనపరచాలనేది ఈ దేశ వ్యతిరేక శక్తుల ప్రధాన వ్యూహం, ఒకసారి ఈ వ్యసనంలో కూరుకుపోతే వ్యక్తి ఆలోచనా శక్తి నశిస్తుంది. తీవ్ర మానసిక రుగ్మతలతో పాటు కాలేయం, గుండె, నరాలవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటాయి. విద్య, ఉద్యోగాలు కోల్పోయి, నేరపూరిత కార్యకలాపాల వైపు అడుగులు వేయడం ద్వారా కుటుంబ శ్రేయస్సు పూర్తిగా నాశనమవుతుంది. ఈ తీవ్రమైన సంక్షో భాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణాన్ని ఒక పాధాన్య జాతీయ లక్ష్యంగా నిర్దే శించుకుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఆగస్టు రెండు న అద్భుతమైన ‘మత్తు రహిత యువత వికసిత భారత్ సంకల్ప ఉద్యమం’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అధికారికం గా ప్రారంభించారు. మాదకద్రవ్య రహిత యువతే వికసిత భారత్-2047 లక్ష్యానికి బలమైన పునాది’అని చాటిచెప్పిన ఈ కార్యక్రమంలో ఒకేసారి దేశవ్యాప్తంగా కోటికి పైగా యువత మాదకద్రవ్య వ్యతిరేక ప్రతిజ్ఞ పూనడం అపూర్వ చరిత్రను తిరగరాసింది. ఈ ఉద్యమం కేవలం ఒక ప్రభుత్వ ఆదేశంగా కాక, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక చైతన్య వంతమైన ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది.
చట్టపరమైన ఉక్కు పాదం
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ వేదికను ఉపయోగించి కోట్ల మంది వాలంటీర్లను ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ఈ ఉద్యమం ద్వారా జాతీయస్థాయి ప్రశ్నోత్తరి. వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాల రచనలు నిర్వహించడం జరుగుతోంది. నాటికలు, అభినయ ప్రదర్శనలు, జానపద గేయాలు, వీధి నాటకాలు, లఘు చిత్రాల ద్వారా మత్తు పదార్థాల దుష్పరిణామాలను గ్రామీణ స్థాయిలోని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. యువతను క్రీడా రంగానికి ఆకర్షితులను చేస్తూ, మానసిక ఉల్లాసానికి స్థానిక క్రీడా పోటీలు, యోగా సాధన, మానసిక పరిపక్వత సలహాలు, ఉచిత వైద్య తనిఖీ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో యువజన సంఘాలను ఏర్పాటు చేసి, మత్తుకు బానిసలైన వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు పంపేలా నడిపిస్తున్నారు. ఈబృహత్తర ప్రచార కార్యక్రమం ఆగస్టు పద్నాలుగున నిర్వ హించబోయే ‘జాతీయ యువ సమ్మేళనం’ తో ముగియనుంది. మత్తు రహిత సమాజ స్థాపనకు కేవలం ప్రచారం మాత్రమే సరిపోదు, దీనికి బహుముఖ వ్యూహం అవసరం. ఒకవైపు చట్టపరమైన ఉక్కు పాదం, మరొకవైపు పునరావాసం కలగలిపి పనిచేయాలి. మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ, రాష్ట్ర పోలీసులు, తీర రక్షక దళం, సుంకముల శాఖల మధ్య మెరుగైన సమన్వ యంతో సరిహద్దులలో నిఘాను తీవ్రతరం చేయాలి.
Drug addiction
లక్ష్యం వైపు అడుగులు వేస్తేనే..
పాఠ శాలలు, కళాశాలల సమీపంలో మాదకద్రవ్యాలు విక్రయించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచి, విద్యాసంస్థలను మత్తు రహిత ప్రాంతాలుగా ప్రకటించాలి. వ్యసనపరులను నేరస్థు లుగా చూడకుండా, బాధితులుగా పరిగణించి వారికి అవస రమైన మానసిక పరిపక్వత సలహాలు, వైద్య సహాయం అందించాలి. ప్రత్యేక ఉచిత సలహాదారుల ద్వారా సలహాలు అందించాలి. భారతీయ సంస్కృతి ఎల్లప్పుడూ శరీర ధర్మాన్ని, మానసిక పరిశుద్ధతను అత్యున్నతంగా భావించింది. ‘ఆరోగ్యమే మ ‘హాభాగ్యం’ అనే ఆర్యోక్తిని స్మరిస్తూ సంస్కా రవంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలే వికసిత భారత్కు ప్రాణాధారమని గుర్తించాలి. ‘మత్తు రహిత యువత వికసిత భారత్’ అనేది కేవలం ప్రభుత్వానికి చెందిన ఒక సంక్షేమ పథకం కాదు. ఇది ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, విద్యాసంస్థ, స్వచ్ఛంద సంస్థ, పౌరుడు స్వీకరించాల్సిన జాతీయ ధర్మం. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ, వారికి కావలసిన ప్రేమను, మానసిక ధైర్యాన్ని ఇంట్లో అందించాలి. మత్తు వదిలి లక్ష్యం వైపు అడుగులు వేస్తేనే వికసిత భారత స్వప్నం సాకారమవుతుంది.
-రామ కిష్టయ్య సంగన భట్ల
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

