Jr NTR: దివంగత నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.
తండ్రిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుతూ వారు విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Read Also : Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం
Harikrishna’s Birth Anniversary: Jr. NTR’s Emotional Post
Jr NTR: “మా అస్తిత్వం మీరు”.. జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం
తండ్రి హరికృష్ణ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ.. “ఈ అస్తిత్వం మీరు, ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న మా ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే” అంటూ ప్రేమతో రాసుకొచ్చారు.
2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. తండ్రి మరణం తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలను కుటుంబ సభ్యులు ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. ప్రతి ఏడాది హరికృష్ణ జయంతి, వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన స్మృతులను కొనసాగిస్తున్నారు.

