Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరీశ్ రావుకు కల్వకుంట్ల కవిత బహిరంగ సవాల్!

హరీశ్ రావుకు కల్వకుంట్ల కవిత బహిరంగ సవాల్!

వార్త 2 weeks ago

Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో మరింత వేడెక్కాయి. కొత్తగా 'తెలంగాణ రక్షణ సేన' పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవిత..

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేయాలంటే ధైర్యముంటే హరీశ్‌రావు తన భార్యను బరిలోకి దింపాలని కవిత బహిరంగ సవాల్ విసిరారు.

Read Also : Konda Surekha: ఫేస్‌బుక్ పోస్టుపై కొండా సురేఖ క్లారిటీ.. అది నా ఖాతా కాదు

 Kalvakuntla Kavitha’s open challenge to Harish Rao!

Kalvakuntla Kavitha: తెరవెనుక రాజకీయాలపై విమర్శలు

తనపై ఎవరు పోటీ చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని కవిత స్పష్టం చేశారు. హరీశ్‌రావు నేరుగా బరిలోకి రాకుండా తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అవసరమని భావిస్తే ఆయన తన భార్యను బరిలోకి దించవచ్చని, ఆమె తనపై పోటీ చేసినా స్వాగతిస్తానని పేర్కొన్నారు. గతంలో సిద్దిపేట నుంచి హరీశ్‌రావుపై పోటీ చేస్తానని చెప్పిన మాటను గుర్తు చేస్తూ… వచ్చే ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవిపై తనకున్న ఆకాంక్షను కవిత బహిరంగంగా వెల్లడించారు. తాను సీఎం కావాలని అనుకుంటున్నానని, అయితే ఆ పదవికి హుందాతనం, గౌరవం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. మరొకవైపు, హరీశ్‌రావు బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారంటూ తీవ్రమైన రాజకీయ ఆరోపణలు గుప్పించారు.

ఇంటర్ విద్య రద్దుపై కవిత తీవ్ర ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha