Konda Surekha: కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. 'త్వరలోనే బిగ్ అప్‌డేట్' అంటూ కొండా సురేఖ పేరుతో ఉన్న ఒక ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
Read Also : Indiramma sarees: చిలకపచ్చ రంగులో ఇందిరమ్మ చీరల పంపిణీ
Konda Surekha clarifies Facebook post… That is not my account.
Konda Surekha: వైరల్ పోస్ట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు
ఈ ప్రచారంపై ఆమె స్పష్టత ఇచ్చింది. తన పేరుతో వైరల్ అవుతున్న వార్తలు, పోస్టులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొండా సురేఖకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే విషయంలో సామాజిక మాధ్యమాల్లోని అనధికారిక ఖాతాలు, వ్యక్తిగత పోస్టులను ప్రామాణికంగా తీసుకోవద్దని సూచించింది.
ఈ అంశంపై ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీ వేరుగా ఉందని వెల్లడించారు. ఫేక్ ఖాతాల ద్వారా జరిగే అసత్య ప్రచారాలను, పోస్టులను ఎవరూ నమ్మవద్దని, ఆ ఖాతాపై తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

