Harish Shankar : టాలీవుడ్‌లో కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోందనే చర్చ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథ :
ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం హరీష్ శంకర్ ఇప్పటికే ఓ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ కథకు సరిపోయే హీరో ఎంపిక విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదనే ప్రచారం సాగుతోంది. కథకు భారీ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అవసరం కావడంతో పలువురు నటుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా హీరో రామ్‌తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన ఓ హీరోతో కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో మెగా హీరోలతో హరీష్ శంకర్ విజయవంతమైన సినిమాలు చేయడంతో మరోసారి ఆ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు రామ్‌తో హరీష్ శంకర్ సినిమా ఉంటే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. హరీష్ శంకర్ నుంచి గానీ, సంబంధిత హీరోల టీమ్‌ల నుంచి గానీ ప్రకటన వెలువడలేదు. దీంతో ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోందన్నది సస్పెన్స్‌గా మారింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్ ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారు? ఆ యాక్షన్ కథకు చివరికి ఏ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

