Vijay Deverakonda: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాకలో వెలసిన ప్రసిద్ధ 'శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ & రీసెర్చ్ సెంటర్' శనివారం ఒక ప్రత్యేకమైన ఆతిథ్యానికి వేదికైంది.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుతో కలిసి ఈ ఉచిత బాలల గుండె వైద్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సౌకర్యాలను, చిన్న పిల్లలకు అందుతున్న ఉచిత గుండె ఆపరేషన్ల వివరాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Read Also: Hyderabad: మబ్బులు తప్ప వానలు కురవలే: హైదరాబాద్‌లో వరుసగా రెండో ఏడాదీ లోటు వర్షపాతమే!
Harish Anna is the 'Lion of Siddipet' - Vijay Deverakonda's sensational comments.
Vijay Deverakonda: హరీశన్న 'సిద్దిపేట కా షేర్'
ఆసుపత్రి సందర్శన అనంతరం జరిగిన సమావేశంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రజాసేవ తత్పరతపై, ఆయన నాయకత్వ లక్షణాలపై ప్రశంసల జల్లు కురిపించారు. స్థానిక ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హరీశన్న కేవలం నాయకుడు మాత్రమే కాదని, ఆయన నిజమైన 'సిద్దిపేట కా షేర్' అని విజయ్ దేవరకొండ కొనియాడారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడ ఉన్న అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.
పిల్లల గుండె వైద్యంపై గొప్ప నిర్ణయం
తెలంగాణ సమాజంలో, ముఖ్యంగా పేద కుటుంబాల్లోని పిల్లలకు ఎదురవుతున్న గుండె సంబంధిత వ్యాధుల తీవ్రతను, ఉచిత వైద్యం యొక్క ఆవశ్యకతను హరీశ్ రావు ముందే గుర్తించారని విజయ్ కొనియాడారు. కార్పొరేట్ స్థాయిలో లక్షలాది రూపాయల ఖర్చయ్యే ఇలాంటి అత్యాధునిక బాలల గుండె వైద్య సేవా కేంద్రాన్ని (Sanjeevani Hospital) సిద్దిపేట గడ్డపై, అందులోనూ కొండపాక ప్రాంతంలో ఏర్పాటు చేయడంలో హరీశ్ రావు తీసుకున్న చొరవ, నిర్ణయం నిజంగా చాలా గొప్పవని అభినందించారు.
ఈ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు జరిగి, వారు పునర్జన్మ పొందుతున్నారని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుందని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వహణ సిబ్బంది, వైద్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Epaper: epaper.vaartha.com

