Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై

హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై

వార్త 2 weeks ago

Harmanpreet Kaur: భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

టెస్టులు, వన్డేలు, టీ20లు.. మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు.

Read Also :Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు మరో షాక్

మూడు ఫార్మాట్లకు వీడ్కోలు

సుదీర్ఘకాలంగా భారత మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇకపై భారత మహిళల జట్టుకు కొత్త సారథిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు అనేక కీలక సిరీస్‌లు, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంది. ఆమె సారథ్యానికి ముగింపు పలకడంతో జట్టు భవిష్యత్ నాయకత్వంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

Harmanpreet Kaur: తదుపరి కెప్టెన్ ఎవరు?

హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో భారత మహిళల జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ను కొనసాగిస్తారా? లేక ఫార్మాట్ల వారీగా వేర్వేరు సారథులను ఎంపిక చేస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కొత్త కెప్టెన్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఒకే రోజు మూడు భారత క్రికెట్ మ్యాచ్‌లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha