Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూర్యకుమార్ యాదవ్‌కు మరో షాక్

సూర్యకుమార్ యాదవ్‌కు మరో షాక్

వార్త 2 weeks ago

Suryakumar Yadav: టీమిండియాలో అవకాశాలు తగ్గుతున్న సమయంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌ కోసం ప్రకటించిన ముంబయి జట్టులో అతడికి చోటు దక్కలేదు.

చండీగఢ్‌తో అక్టోబర్ 11న జరగనున్న మ్యాచ్‌కు సూర్య అందుబాటులో ఉన్నప్పటికీ సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.

Read Also :Indian cricket matches: నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఒకే రోజు మూడు భారత క్రికెట్ మ్యాచ్‌లు

19 ఏళ్ల యువ ఆటగాడికి వైస్ కెప్టెన్సీ

ముంబయి సెలెక్టర్లు 19 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుష్ మాత్రేకు జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. భారత అండర్-19 జట్టుకు ప్రపంచకప్ అందించిన అనుభవం ఉన్న మాత్రేను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అతడు 13 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ గత 18 నెలలుగా ఒక్క రెడ్ బాల్ మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ముందుగా కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడి ఫామ్‌లోకి రావాలని సూచించినట్లు ముంబయి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రమేశ్ పవార్ తెలిపారు. సూర్య తాను అందుబాటులో ఉంటానని సెలక్షన్ కమిటీకి సందేశం పంపినప్పటికీ జట్టులో చోటు కల్పించలేదు.

అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తగ్గిన అవకాశాలు

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సూర్యకుమార్‌కు అవకాశాలు తగ్గుతున్నాయి. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడిని ఈ ఏడాది టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబయి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు సిద్ధేశ్ లాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు రంజీ మ్యాచ్ జైస్వాల్‌కు ఉపయోగపడనుంది.

Suryakumar Yadav: శార్దూల్ ఠాకూర్‌కు గాయం

ముంబయి జట్టుకు శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉండడు. శిక్షణ సమయంలో కుడి చేతి మధ్యవేలికి ఫ్రాక్చర్ కావడంతో కనీసం తొలి రెండు మ్యాచ్‌లకు అతడు దూరంగా ఉండనున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆయుష్ మాత్రే, సిద్ధేశ్ లాడ్ ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. సిద్ధేశ్ లాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆయుష్ మాత్రే (వైస్ కెప్టెన్), దివ్యాంశ్ సక్సేనా, ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్, ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), శమ్స్ ములానీ, తనుష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్థి, సిల్వెస్టర్ డిసౌజా, ఓంకార్ టర్మలే.

మంత్రి లోకేశ్‌తో ఆసియా క్రీడల స్వర్ణ విజేత జ్యోతి సురేఖ భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha