Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత: చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత: చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి

వార్త 2 weeks ago

Tanker Hit in Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక ఎల్‌ఎన్‌జీ (LNG) చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడి కారణంగా నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఈ ఘటనను అధికారికంగా ధ్రువీకరించింది. ఈ దాడిపై ఇరాన్ (Iran) ప్రభుత్వ టెలివిజన్ స్పందించింది. ఖతార్ నుంచి సహజవాయువును తీసుకెళ్తున్న ఈ ట్యాంకర్‌కు తాము ముందుగానే హెచ్చరికలు జారీ చేశామని, అయితే నౌక వాటిని ఖాతరు చేయకపోవడం వల్లే లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. తమ సైన్యం నిర్దేశించిన మార్గాల్లోనే నౌకలు ప్రయాణించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని ఇరాన్ గతవారమే హెచ్చరించింది. అయితే, ఈ దాడి తామే చేశామంటూ ఇరాన్ ప్రభుత్వం లేదా సైన్యం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read Also: Khamenei's Mortal Remains : ఖోమ్ నగరానికి ఖమేనీ పార్థివదేహం !

 Tanker Hit in Strait of Hormuz

Tanker Hit in Strait of Hormuz : ట్రంప్ హెచ్చరికలు – ఇరాన్ వ్యూహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఇరాన్ చర్చల ఒప్పందానికి రాకపోతే గంటల వ్యవధిలోనే ఆ దేశ వంతెనలను కూల్చేస్తామని, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ట్రంప్ సోమవారం హెచ్చరించారు. దీనికి కౌంటర్‌గా ఇరాన్ ఈ దాడికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా దళాలు జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ సైన్యం ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు, ఇటీవల వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఖోమ్ నగరంలో భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ అంతిమయాత్రలో పాల్గొన్న లక్షలాది మంది ప్రజలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ కూడా గత దాడిలో గాయపడ్డారనే ప్రచారం నడుస్తుండటంతో ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు.

పథకం ప్రకారమే పహల్గామ్ దాడి..ఛార్జ్‌షీట్‌లో హఫీజ్ సయీద్ పేరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha