Jag Vikram LPG Tanker: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో కాస్త సడలాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద వారం రోజులుగా నిలిచిపోయిన భారత ఎల్పీజీ ట్యాంకర్ 'జగ్ విక్రమ్' ఎట్టకేలకు గమ్యం దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది.
Read Also:US Iran peace talks : ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు
Jag Vikram LPG Tanker: వారం రోజుల నిరీక్షణకు తెర
సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీ (LPG) నిల్వలతో ఉన్న ‘జగ్ విక్రమ్’ నౌక, యుద్ధం కారణంగా వారం రోజులుగా హర్మూజ్ జలసంధి వద్దే సముద్ర జలాల్లో వేచి చూడాల్సి వచ్చింది. ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఈ నౌక ప్రయాణానికి మార్గం సుగమమైంది.అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత హర్మూజ్ జలసంధిని దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్ ఇదే.
శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ జగ్ విక్రమ్.. హర్మూజ్ జలసంధిని దాటి.. శనివారం మధ్యాహ్నం వరకు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో జలాల్లోకి ప్రవేశించింది.మరికొద్ది రోజుల్లో ఈ నౌక భారత్‌కు చేరుకోనుంది. ఈ పరిణామం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో భద్రతపై ఇది సానుకూల సంకేతాలను సూచిస్తుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

