Dailyhunt
టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్ అమలు

టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్ అమలు

వార్త 1 week ago

Fastag new rules india : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలక సమాచారం. నేటి నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఇకపై నగదు రూపంలో టోల్ చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఫాస్టాగ్ తప్పనిసరి

ఇక మీదట ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరిగా ఉండాలి. వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా లేదా అందులో బ్యాలెన్స్ లేకపోయినా టోల్ చెల్లించడానికి యూపీఐ (UPI) మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉపయోగించాల్సి ఉంటుంది.

అదనపు ఛార్జీలు

ఫాస్టాగ్ లేకపోతే యూపీఐ ద్వారా చెల్లించే సమయంలో సాధారణ టోల్ ధర కంటే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

నగదు చెల్లింపులకు పూర్తిగా నో

టోల్ గేట్ల వద్ద నగదు చెల్లింపులు ఇక పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ ఎవరైనా నగదు చెల్లిస్తామని పట్టుబడితే వారి వాహనాన్ని హైవేపైకి అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు.

Read Also: Nitish Kumar as a member of Rajya Sabha: బిహార్ రాజకీయాల్లో నూతన అధ్యాయం: రాజ్యసభ సభ్యునిగా నీతీశ్‌ కుమార్

 Fastag new rules india

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

టోల్ చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఆన్‌లైన్ జరిమానాలు విధించడం లేదా నోటీసులు పంపే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రయాణానికి ముందు ఫాస్టాగ్ చెక్ చేయండి

హైవే ప్రయాణంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ముందుగానే ఫాస్టాగ్ వాలెట్‌లో బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గించి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మోదీ మహిళలకు క్షమాపణలు చెప్పాలి అంటూ కాంగ్రెస్ డిమాండ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha