Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్‌లో కఠిన ఆంక్షలు.. రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతి

హర్మూజ్‌లో కఠిన ఆంక్షలు.. రోజుకు 15 నౌకలకు మాత్రమే అనుమతి

వార్త 2 months ago

Iran hormuz strait : పశ్చిమాసియాలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితులు కొంత సద్దుమణిగాయని భావించిన ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో షాక్ ఇచ్చింది.

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా రోజుకు కేవలం 15 నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది.

ఈ విషయాన్ని ఇరాన్ సీనియర్ వర్గాలు రష్యా వార్తా సంస్థ TASS కు వెల్లడించాయి. యుద్ధానికి ముందు ఉన్నట్లుగా ఈ మార్గంలో పూర్తిస్థాయి స్వేచ్ఛా రవాణా ఇక ఉండదని కూడా స్పష్టం చేశాయి.

ముందస్తు అనుమతి తప్పనిసరి

ఇకపై హర్మూజ్ జలసంధిని దాటే ప్రతి నౌక ఇరాన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. ఈ రవాణా మొత్తం ఇరాన్ సాయుధ బలగాలైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పర్యవేక్షణలో ఉంటుందని తెలిపింది.

అంతేకాదు, నౌకలు ప్రయాణించాలంటే IRGC విధించే ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉండటంతో పాటు టోల్ చెల్లించాల్సి ఉంటుందని కూడా సంకేతాలిచ్చింది.

దేశాలతో నేరుగా చర్చలు

నౌకల రాకపోకలపై సంబంధిత దేశాలతో IRGC నేరుగా చర్చలు జరిపే అవకాశం ఉందని ఇరాన్ పేర్కొంది. తమ అనుమతి లేకుండా ఏ నౌక కూడా హర్మూజ్ జలసంధిని దాటలేదని కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నట్లు తెలిపింది.

ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యం?

ఈ నిర్ణయం వెనుక ఇరాన్ తన ఆర్థిక ప్రయోజనాలను కూడా ముడిపెట్టినట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఆస్తుల విడుదల అంశాన్ని హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణాతో అనుసంధానించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Read Also:Kerala girl missing : ట్రెక్కింగ్‌లో అదృశ్యమైన 14 ఏళ్ల బాలిక

ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం

హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం. ఈ మార్గంలో (Iran hormuz strait) రోజుకు కేవలం 15 నౌకలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha