Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్యానాలో దారుణం: ఆరు నెలల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి

హర్యానాలో దారుణం: ఆరు నెలల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి

వార్త 2 weeks ago

Atrocity in Haryana : హర్యానాలోని సోనిపట్ సిక్కా కాలనీలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. తన తల్లి ఒడిలో ప్రశాంతంగా ఉన్న ఆరు నెలల పసికందుపై ఒక పెంపుడు కుక్క ఒక్కసారిగా దాడికి దిగింది.సమాచారం ప్రకారం, సదరు మహిళ తన ఆరు నెలల పాపను ఒడిలో పట్టుకుని పొరుగింటి వ్యక్తితో మాట్లాడుతోంది.

అదే సమయంలో ఆ ఇంటి ప్రధాన గేట్ తెరుచుకోవడంతో, లోపల ఉన్న పెంపుడు కుక్క వేగంగా బయటకు వచ్చి చిన్నారిపైకి దూకింది. కుక్క దాడి చేసిన తీవ్రతకు చిన్నారి తల్లి ఒడిలోంచి కింద పడిపోయింది. ఆ వెంటనే కుక్క ఆ పాపపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచింది.

Shadnagar School Student: పాఠశాల మెట్లపై నుంచి పడి నాలుగో తరగతి విద్యార్థిని మృతి

 Atrocity in Haryana

Atrocity in Haryana : చిన్నారికి అత్యవసర చికిత్స

ఈ ప్రమాదాన్ని గమనించిన ఆ ప్రాంతంలోని నాలుగైదు మంది వ్యక్తులు వెంటనే స్పందించి, కర్రలతో కుక్కను కొట్టి చిన్నారిని దాని బారిన నుండి విడిపించారు. అయితే, వారు స్పందించే లోపే ఆ పసికందు శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. రక్తం మడుగులో ఉన్న చిన్నారిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ భయాందోళనకర ఘటన అంతా అక్కడ అమర్చిన సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. పెంపుడు కుక్కల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha