Shadnagar School Student: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఒక పాఠశాలలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న వర్ణిక అనే చిన్నారి ప్రమాదవశాత్తు పాఠశాల మెట్లపై నుంచి కిందపడిపోయింది.
తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలికను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Fourth-grade student dies after falling from school stairs.
Read Also : Haribabu Murder: ఆనందంగా ఉంది..బాధగానూ ఉంది: యూట్యూబర్ వైష్ణవి వదిన సెల్ఫీ వీడియో
Shadnagar School Student: సీసీ కెమెరాలో రికార్డయిన ప్రమాద దృశ్యాలు
పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గది నుంచి కిందకు వస్తున్న క్రమంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. వర్ణిక మెట్లపై నుంచి వేగంగా దిగుతూ అదుపుతప్పి కిందపడిపోతున్న దృశ్యాలు పాఠశాలలోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
పాఠశాలలో తోటి విద్యార్థులతో ఎంతో ఆనందంగా గడిపే వర్ణిక ఇలా అకస్మాత్తుగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థులలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

