Palwal KMP Expressway Accident: హర్యానాలోని పల్వాల్ జిల్లా పరిధిలో ఉన్న కుండ్లీ-మానేసర్-పల్వాల్ (KMP) ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం (సెప్టెంబర్ 01) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
రాజస్థాన్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని బృందావన్ వైపు వెళ్తున్న యాత్రికుల పికప్ వాహనం.. రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Also : Medchal ORR Accident: మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీలు ఢీ.. ఒకరు మృతి
Horrific road accident in Haryana; six pilgrims killed.
Palwal KMP Expressway Accident: రాజస్థాన్ క్షేత్రాల దర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం
ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన సుమారు 21 మంది భక్తులు శుక్రవారం పుణ్యయాత్రకు బయలుదేరారు. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ ఖాటూ శ్యామ్ ఆలయం, సాలాసర్ బాలాజీ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని మథుర-బృందావన్ వైపు తిరుగు ప్రయాణమయ్యారు.
మంగళవారం తెల్లవారుజామున పల్వాల్ సమీపంలో కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వేగానికి పికప్ వాహనం ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయి ప్రయాణికులు అందులోనే చిక్కుకుపోయారు. స్థానికులు, ఇతర వాహనదారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
డ్రైవర్ నిద్రమత్తుే కారణమని అనుమానం
పోలీసులు, స్థానికులు వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి పల్వాల్ జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆరుగురు (ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు) మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన 16 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పికప్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రహదారి పక్కన ట్రక్కును నిలిపి ఉంచిన పరిస్థితులు, డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, మైన్‌పురిలోని బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పుణ్యక్షేత్రాలు దర్శించుకుని వస్తుండగా జరిగిన ఈ విషాదంతో వారి గ్రామాల్లో శోకసంద్రం అలుముకుంది.
హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కుమారుడి అరెస్ట్

