Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీలు ఢీ.. ఒకరు మృతి

మేడ్చల్ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీలు ఢీ.. ఒకరు మృతి

వార్త 2 weeks ago

Medchal ORR Accident: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం కారణంగా నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి మరొక భారీ లారీ బలంగా ఢీకొట్టడంతో, లారీ పైన ఉన్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Read Also : LPG E-KYC deadline: గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీకి మరో అవకాశం

 Lorries collide on Medchal Outer Ring Road; one dead.

Medchal ORR Accident: వర్షం కారణంగా టార్పాలిన్ కడుతుండగా ప్రమాదం

వివరాల ప్రకారం.. చెన్నై నుంచి ప్లైవుడ్ లోడుతో మియాపూర్ వెళ్తున్న లారీని వర్షం రావడంతో తెల్లవారుజామున రోడ్డుపక్కన నిలిపారు. లారీలోని ప్లైవుడ్ తడవకుండా ఉండేందుకు బీహారీ రాయ్‌ (35) అనే వ్యక్తి లారీపైకి ఎక్కి టార్పాలిన్ కడుతున్నాడు. అదే సమయంలో కీసర నుంచి తెల్లాపూర్ వైపు క్రషర్ లోడుతో వెళ్తున్న భారీ లారీ అతివేగంగా వచ్చి నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

అక్కడికక్కడే మృతి.. గాంధీ ఆస్పత్రికి తరలింపు

ప్రమాద తీవ్రతకు లారీపై ఉన్న బీహారీ రాయ్‌ ఒక్కసారిగా కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

త్వరలోనే మహిళలకు ఉచిత ఏసీ బస్సు ప్రయాణం.. సీఎం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha