Dailyhunt
Himachal Pradesh: విద్య పేరుతో వేధింపులు..19 ఏళ్ల విద్యార్థి మృతి

Himachal Pradesh: విద్య పేరుతో వేధింపులు..19 ఏళ్ల విద్యార్థి మృతి

వార్త 3 months ago

హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల పల్లవి అనే విద్యార్థిని ర్యాగింగ్, (Ragging) లైంగిక వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయింది.

మృతురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం, గతేడాది సెప్టెంబర్ 18న కళాశాలలో లెక్చరర్‌తో పాటు ముగ్గురు తోటి విద్యార్థులు పల్లవిపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వేధింపుల ప్రభావంతో ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.

Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

Harassment in the name of education

చికిత్స విఫలం.. కేసు నమోదు

పల్లవిని చికిత్స కోసం పలు ఆసుపత్రులకు తరలించారు. చివరకు లుధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ డిసెంబర్ 26, 2025న ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత లెక్చరర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ విషాదం విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై తీవ్రమైన ఆందోళనను కలిగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

AP Crime: SBI దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు: ఎస్పి సతీష్ కుమార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha