Kiccha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తన సినీ కెరీర్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) పోషించిన పాత్ర గురించి తాజాగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తన జీవితంలో ఆర్జీవి ఎప్పటికీ ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిచిపోతారని, తన ప్రయాణానికి ఆయనే పునాది వేశారని సుదీప్ గుర్తు చేసుకున్నారు.ఆర్జీవి తనను ‘ఫూంక్’ చిత్రానికి ఎంపిక చేయడంతోనే తన బాలీవుడ్ ప్రయాణం ప్రారంభమైందని సుదీప్ తెలిపారు. “ఆ సమయంలో ఆర్జీవి సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావిత వ్యక్తులలో ఒకరు. ఎంతో మంది హేమాహేమీలు ఉన్న కాలంలో ,నన్ను ఆయన ఎంచుకోవడం నా అదృష్టం” అని సుదీప్ పేర్కొన్నారు.
Read Also:Anupama Parameswaran: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నటి అనుపమ?
Kiccha Sudeep RGV
Kiccha Sudeep: అమితాబ్ బచ్చన్‌తో ‘రణ్’ అనుభవం
రణ్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ వంటి హిందీ డిక్షన్లో పట్టున్న లెజెండరీ నటుడి ముందు నాలుగు పేజీల డైలాగులు చెప్పడం తనకెంతో సవాలుగా అనిపించిందని సుదీప్ పంచుకున్నారు. తనకు హిందీ సరిగా రాకపోయినా, అమితాబ్‌ను తన నటనతో, హిందీతో ఆకట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నించానని ఆయన తెలిపారు. "నా ఛాలెంజ్ ఆర్జీవి కాదు, అమితాబ్ సర్ ను నా హిందీతో ఇంప్రెస్ చేయడమే" అని సుదీప్ అన్నారు. తన సౌత్ ఇండియన్ యాక్సెంట్ రాకుండా జాగ్రత్త పడాలని, దానికోసం ఎంతో కష్టపడ్డానని ఆయన వెల్లడించారు. ఈ ప్రయత్నం తర్వాత, మళ్లీ హిందీ సినిమాలు చేయకూడదని బెంగళూరుకు తిరిగి వచ్చేశానని సుదీప్ సరదాగా చెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

